విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు ఆదేశాల బేఖాతర్-మాన్సాస్ ఉద్యోగులకు అందని జీతాలు-నిరసనల పర్వం

|
Google Oneindia TeluguNews

విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులకు జీతాల వ్యవహారంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా వారి వెతలు మాత్రం తీరలేదు. ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడంతో వారు ఇవాళ కూడా తమ నిరసనలు కొనసాగించారు. మాన్సాస్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు ఆదేశాలను ఈవో పాటించకపోవడమే ఇందుకు కారణం.

మాన్సాస్ ఉద్యోగుల జీతాలు నిలిపేస్తూ ఈవో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. దీంతో ఉద్యోగులు ఛైర్మన్ అశోక్ గజపతిరాజుకు మొరపెట్టుకున్నారు. అయినా వారి వెతలు తీరకపోగా మరింత ఎక్కువయ్యాయి. ఉద్యోగులతో పాటు అశోక్ పైనా ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అయితే మాన్సాస్ ఉద్యోగుల జీతాలపై అశోక్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈవో తీరును తీవ్రంగా ఆక్షేపించింది. అయినా పరిస్ధితిలో ఎలాంటి మార్పూ లేదు.

mansas employees protests continue for salaries as no implementation of high court orders

హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు ఇంకా అందకపోవడంతో వారు నిరనసలు చేపట్టారు. తమకు జీతాలు చెల్లించాలంటూ విజయనగరంలో మాన్సస్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి.. జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన అధికారులు అమలుచేయక పోవటం పై ఉద్యోగులు మండిపడుతున్నారు... ఎమ్ ఆర్ అటానమాస్ కాలేజ్ వద్ద మానవహారం నిర్వహించి ఉద్యోగులు తమ నిరసన వ్యక్తం చేశారు.. మాన్సస్ జెఏసీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి పలు కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.

English summary
mansas trust employees continue protests for salaries even after high court orders to pay them first.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X