వరంగల్ నిట్ లో కరోనా కలకలం - 13 మందికి పాజిటివ్ : సెలవుల ప్రకటన..!!
కరోనా మహమ్మారి మరోసారి విశ్వరూపం చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా..వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో ఐదుగురికి కరోనా కలకలం రేపింది. నిట్‌లో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో ఫ్యాకల్టీకి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన నిట్ అధికారులు.. ఈ నెల 16వ తేదీ వరకు కళాశాలకు సెలవులు ప్రకటిస్తూ నిట్ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు.
ఇటీవల క్రిస్మస్ వేడుకలకు ఇంటికి వెళ్లి వచ్చిన 200 మంది విద్యార్థులకు అధికారులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సిబ్బంది ఒకరికి పాజిటివ్ రాగా.. మరో 13 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రైమరీ కాంటాక్టు అయిన వారందరూ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ నెల 16 వరకు పలు తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన చేయనున్నట్లు నిట్ డైరెక్టర్ ఆచార్య ఎన్వీ రమణారావు వెల్లడించారు.

పలువురు విద్యార్థులు కోవిడ్ బారిన పడుతుండడంతో.. మిగతా విద్యార్థులు, ఉద్యోగులందరికీ కూడా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.ఉద్యోగులందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా తెలంగాణలో 1,913 కొత్త కరోనా కేసులు రాగా, ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 232 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7,847 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీలో 1,214, రంగారెడ్డిలో 213, మేడ్చల్‌లో 161 కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 94కు చేరుకుంది. అయితే దేశవ్యాప్తంగా 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.












Click it and Unblock the Notifications