వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డీసీపీ రక్షితది ముమ్మాటికీ తప్పే.. ఏసీపీ గారూ..కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయద్దు, సీతక్క

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యే సీతక్క బంధువులను డీసీపీ రక్షిత నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీతక్క ఒంటికాలిపై లేచారు. అయితే ఆ ఘటనలో డీసీపీ రక్షిత ప్రమేయం లేదని, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని ఏసీపీ రంగస్వామి ప్రకటన చేశారు. దీంతో సీతక్క స్పందించారు. ఏసీపీ ప్రకటన వందకు వంద శాతం తప్పని అన్నారు. అక్క డ జరిగిన వాస్తవాన్ని తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని, పోలీసులు మానవత్వంతో పనిచేయాలని సూచించారు.

వాస్తవాలను కప్పిపూయడమేంటి..?

వాస్తవాలను కప్పిపూయడమేంటి..?

వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయకూడదని సీతక్క అన్నారు. తమ వాళ్లు ములుగు కలెక్టరేట్ నుంచి వెహిల్ పాస్ తీసుకుని హైదరాబాద్ బయలుదేరారని వివరించారు. రామంతపూర్‌లో పోలీసులు తమ వాళ్ల వాహనాన్ని ఆపారని గుర్తుచేశారు. ఇదీ ఎమ్మెల్యే సీతక్క వాహనమని, ఆమె తల్లి ప్రమాదంలో ఉందని చెప్పినా డీసీపీ రక్షిత వినలేదని పేర్కొన్నారు. తాను ఫోన్‌లో మాట్లాడే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదని, చివరికి వీడియో కాల్‌లో మాట్లాడతామని అన్నా ఆమె స్పందించలేదన్నారు. ఇది వాస్తవమని సీతక్క స్పష్టం చేశారు. అవాస్తవాలు చెప్పి ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదని అన్నారు.

డీసీపీ దురుసుగా..

డీసీపీ దురుసుగా..

కరోనాతో బాధపడుతున్న సీతక్క తల్లికి బ్లడ్‌ ఇచ్చేందుకు వెళ్తున్న.. బంధువుల పట్ల డీసీపీ రక్షిత దురుసుగా ప్రవర్తించారని నిన్న సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. వెహికల్‌ పర్మిషన్ ఉన్నా పోలీసులు ఆరగంట సేపు నిలిపివేశారన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. సీతక్క వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఏసీపీకి సీతక్క కౌంటర్

ఏసీపీకి సీతక్క కౌంటర్


ఏసీపీ రియాక్ట్ కాగా.. సీతక్క వెంటనే జరిగిన పరిస్థితిని వివరించారు. పోలీసులు మానవత్వం.. జాతి, దయతో పని చేయాలని సూచించారు. లాక్ డౌన్ పేరుతో కర్కశంగా ప్రవర్తించడం సరికాదన్నారు. దీంతో సదరు కుటుంబాలకు జరగరాని నష్టం జరుగుతుందన్నారు. అలా జరిగితే ఎవరూ బాధ్యులు అని సీతక్క ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉంది కదా అని.. ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తే సరికాదన్నారు. జరిగే పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని సీతక్క తెలియజేశారు. తగిన సమయం చూసి వారే బుద్దిచెబుతారని తెలిపారు.

సీతక్క సేవ కార్యక్రమాలు

సీతక్క సేవ కార్యక్రమాలు

అంతకుముందు సీతక్క పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అడవి రంగాపూర్‌ గ్రామంలో బండ్లపహాడ్‌ గొత్తికోయగూడెం వాసులకు సీతక్క ఆప‌న్న‌హస్తం అందించారు. గ్రామానికి దూరంగా నివసిస్తున్న గొత్తికోయలు కోవిడ్ నేప‌థ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. గుత్తికోయల వద్దకు వెళ్లి సరుకులు అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతానికి స‌రైన మార్గం లేదు. న‌డుస్తూ అంత‌దూరం స‌రుకులు తీసుకెళ్ల‌డం క‌ష్టం. ఈ క్ర‌మంలో ఎడ్లబండిపైనే ఆమె ప్రయాణించారు. ఆ బండిపైనే సరుకులు వేసుకుని అదే బండిపై తానూ అక్క‌డికి చేరుకున్నారు. ఆమె వెంట అనుచరులు, గన్‌మ్యాన్లు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. బియ్యం, కూరగాయలు, ఇతరత్రా సరుకులు గొత్తికోయలకు అందజేసి సీతక్క వారికి అండగా నిలిచారు. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో సీత‌క్క చేసిన స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌లు అభినందిస్తూనే ఉన్నారు.

English summary
acp sir..dcp rakshitha misbehave to my family mla sithakka clarify
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X