Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాత శవం ఫ్రిజ్ లో పెట్టిన మనవడు, చెప్పింది విని అవాక్కైన పోలీసులు ; వరంగల్ లో షాకింగ్ ఘటన

పేదరికం ఒక మనిషిని ఎంతవరకైనా దిగజార్చేలా చేస్తుంది. పేదరికం మనిషిని అర్థం పర్థం లేని పనులకు ప్రేరేపిస్తుంది. పేదరికం మనిషితో చెయ్యకూడని తప్పులు కూడా చేయిస్తుంది. పేదరికం విస్మయం కలిగించే విషయాలకు, గగుర్పొడిచే అనేక దారుణాలకు కారణమవుతుంది. ఇక తాజాగా అలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

పరకాలలో ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన .. టాటా శవం ఫిర్జ్ లో దాచిన మనవడు

పరకాలలో ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన .. టాటా శవం ఫిర్జ్ లో దాచిన మనవడు

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా కనబడకుండా పోయిన బాలయ్య అనే 95 ఏళ్ళ వృద్ధుడు విగతజీవిగా ఒక ఫ్రిజ్ లో శవమై కనిపించాడు. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ సంఘటనలో అందరూ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న బాలయ్య మనవడు తాత మరణిస్తే చేతిలో చిల్లిగవ్వ లేని దయనీయమైన పరిస్థితిలో, తాత శవాన్ని రెండు రోజుల పాటు ఫ్రిజ్ లో దాచి పెట్టాడని స్థానికంగా చర్చ జరుగుతుంది. డబ్బులు సమకూర్చుకున్న తర్వాత తాత శవానికి అంత్యక్రియలు చేయాలని, డబ్బు సమకూర్చుకునే వరకు శవం కుళ్ళి పోకుండా ఉండటం కోసం ఎవరూ ఆలోచించని విధంగా ఓ అసాధారణ ఆలోచన చేశాడని చర్చ జరుగుతుంది.

మృతుడు బాలయ్య కుటుంబ నేపధ్యం ఇది

మృతుడు బాలయ్య కుటుంబ నేపధ్యం ఇది

ఇక మృతుడు బాలయ్య కుటుంబం నేపథ్యానికి వస్తే కామారెడ్డి జిల్లాకు చెందిన బైరి బాలయ్య ఓ రిటైర్డ్ లెక్చరర్. పరకాల పట్టణంలో బాలయ్య కుమారుడు, హరికిషన్ పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగించేవాడు. వారికి నిఖిల్ అనే కుమారుడు ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత బాలయ్య, ఆయన భార్య కుమారుడు వద్దకే వచ్చి జీవనం సాగిస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో బాలయ్య కుమారుడు హరికిషన్ మరణించాడు. ఇక కోడలు పదిహేనేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించింది. ఇటీవల బాలయ్య భార్య నరసమ్మ కరోనాతో కన్నుమూసింది.

 బాలయ్య మృతి .. శవాన్ని ఫ్రిజ్ లో పెట్టిన మనవడు

బాలయ్య మృతి .. శవాన్ని ఫ్రిజ్ లో పెట్టిన మనవడు

ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య ఇటీవల కనిపించకుండా పోయాడు. మనవడు నిఖిల్ ను అడిగితే ఏదేదో చెప్పేవాడు.ఇక తాజాగా స్థానికులు ఇంట్లో బాలయ్య శవాన్ని చూసి షాక్ తిన్నారు.తాత చనిపోతే బాలయ్య మనవడు నిఖిల్ ఏం చేయాలో పాలుపోక, ఏమీ అర్ధం కాక, అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక బాలయ్య మృతదేహాన్ని ఫ్రిజ్ లో పెట్టినట్లుగా చెప్పినట్లు సమాచారం. రెండు రోజులుగా బాలయ్య మృతదేహం కుళ్ళి కాలనీలో దుర్వాసన రావడంతో గుర్తించిన స్థానికులు బాలయ్య ఇంటికి వెళ్లి చూడడంతో, ఫ్రిజ్ లో బాలయ్య మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలయ్య మనవడు నిఖిల్ ను విచారిస్తున్నారు.

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ విషయం చెప్పిన మనవడు నిఖిల్

పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిజంగానే డబ్బులు లేక శవాన్ని ఫ్రిజ్ లో పెట్టాడా? లేక హత్య చేశాడా? శవాన్ని మాయం చేయడానికి ఫ్రిజ్ లో శవాన్ని దాచి పెట్టాడా? వంటి అనేక కోణాలలో నిఖిల్ ను విచారిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ ఈ కేసులో అసలు విషయం బయట పడే అవకాశం లేదు. ఏది ఏమైనా శవాన్ని దహనం చేయలేని పేదరికం వల్లే తాను తాత శవాన్ని ఫ్రిజ్లో దాచి పెట్టానని మనవడు నిఖిల్ చెప్పిన విషయం ఇప్పుడు అందరిని విస్మయానికి గురి చేస్తుంది. నిఖిల్ మానసిక పరిస్థితిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+