వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ కు వడివడిగా అడుగులు .. ఓరుగల్లుపై తెలంగాణా సర్కార్ ఫోకస్ !!

వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. వరంగల్ లో దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని భూ సేకరణ చేసిన తెలంగాణ ప్రభుత్వం మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఇందులో కొరియా దేశానికి చెందిన ప్రముఖ యంగ్వాన్ కంపెనీ ప్రతినిధులు ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టి పనులు చేస్తున్నారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి టెక్స్ టైల్ పార్క్ ను ప్రారంభించాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది.

 కేరళ కైటెక్స్ తో సమావేశం .. వరంగల్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులకు అంగీకారం

కేరళ కైటెక్స్ తో సమావేశం .. వరంగల్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులకు అంగీకారం

కేరళ లోని ప్రముఖ టెక్స్ టైల్ కంపెనీ కైటెక్స్ కంపెనీతో వరంగల్ లో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒప్పించిన ఐటీ పరిశ్రమలు చేనేత శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ కు పూర్వవైభవం తీసుకురానున్నట్టు త్వరలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు జరగనున్నట్లు ప్రకటించారు. వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్ ఇప్పటికే వరంగల్ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో టెక్స్ టైల్ పార్క్ విషయంలో కూడా ముందుకు వెళ్ళటం ప్రధానంగా కనిపిస్తుంది.

 వరంగల్లో గతంలో ఆజం జాహీ మిల్లు, బిల్ట్ కర్మాగారం తో కార్మికులకు ఉపాధి

వరంగల్లో గతంలో ఆజం జాహీ మిల్లు, బిల్ట్ కర్మాగారం తో కార్మికులకు ఉపాధి

వరంగల్ నగరంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కేరళ టెక్స్టైల్ కంపెనీ కైటెక్స్ పెట్టుబడి పెడితే వేల మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించటం సాధ్యమవుతుందని తెలుస్తుంది. వరంగల్ జిల్లాలో ఒకప్పుడు నిజాం కాలంలో ఆజం జాహీ మిల్లు వేలాది మంది కార్మికులకు జీవనోపాధిని కల్పించింది. క్రమేణా ఆ మిల్లు మూతపడడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిల్ట్ కర్మాగారం ఉండేది . కమలాపూర్ బిల్ట్ కర్మాగారం కూడా మూత పడింది .

టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఆ లోటు తీరుస్తామన్న తెలంగాణా సర్కార్

టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసి ఆ లోటు తీరుస్తామన్న తెలంగాణా సర్కార్

అప్పటినుండి ఓరుగల్లు ప్రజలకు ఉపాధి చూపించే అతి పెద్ద పరిశ్రమ ఏది లేకపోవడం స్థానిక ప్రజల ఆగ్రహానికి కారణమైంది.ఈ క్రమంలోనే ఓరుగల్లులో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు గతంలో కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్.. ఇది ఓరుగల్లు వాసులకు కొంత రిలీఫ్ ఇచ్చినట్లయింది. అప్పటినుండి టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక తాజాగా ఈ పనుల్లో వేగం పెంచిన తెలంగాణ ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి చెందిన టెక్స్టైల్ కంపెనీ కైటెక్స్ తో పెట్టుబడి పెట్టడానికి ఒప్పించడం స్థానికులకు సంతోషాన్ని కలిగిస్తుంది.

Recommended Video

    Telangana Municipal Elections : కరోనా నిబంధనలతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్...!!
     టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుపై ఎర్రబెల్లి దయాకర్ రావు దృష్టి

    టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుపై ఎర్రబెల్లి దయాకర్ రావు దృష్టి

    తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు, మంత్రి కేటీఆర్ నిర్ణయాలకు వరంగల్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గతంలో ఏప్రిల్ నెలలో టెక్స్ టైల్ పార్క్ ను ఉద్దేశించి మరో ఆరు నెలల్లో టెక్స్ టైల్ పార్క్ ను ప్రారంభించకుంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోమారు టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+