మళ్ళీ సెంటిమెంట్ రాజేస్తున్నారా.. వరంగల్ లో కేటీఆర్ వ్యాఖ్యల మతలబు అదేనా? హాట్ డిబేట్!!
వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన, మంత్రి కేటీఆర్ బిజెపి, కాంగ్రెస్ లపై విరుచుకు పడిన తీరు, చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. ఓరుగల్లు ప్రజలకు చేసిన అభివృద్ధి చెప్పడానికి ఏమీ లేక అసహనంతో బిజెపి, కాంగ్రెస్ లపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు అన్న చర్చ స్థానికంగా కొనసాగుతుంది.మళ్ళీ తెలంగాణా ప్రజల్లో సెంటిమెంట్ గుర్తు చేస్తున్నారన్న చర్చ కూడా ఆసక్తికరంగా మారింది.

వరంగల్ పర్యటనలో బీజేపీ, కాంగ్రెస్ లపై విరుచుకుపడిన కేటీఆర్
మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పై విరుచుకుపడిన మంత్రి కేటీఆర్, ఎవడీ రేవంత్ రెడ్డి ఎవడీ బండి సంజయ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నేతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
మాకు బూతులు రావా? అంటూ మండిపడిన కేటీఆర్ మోదీని బట్టేబాజ్ , లుచ్చా గాడు అంటూ తిట్టలేమా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ లేకుంటే టిపిసిసి, టీ బీజేపీ ఎక్కడివి అంటూ మండిపడ్డారు.
కెసిఆర్ లేకపోతే నేడు మొరుగుతున్న కుక్కలు, గాడిదలు ఎక్కడివి అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. నాలుక వాడటం మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు మాట్లాడలేరు అంటూ నిప్పులు చెరిగారు. అంతేకాదు ఎట్టికైనా మట్టి కైనా మనోడే కావాలని, ఇంటి పార్టీ శ్రీరామరక్ష అని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష పార్టీలపై కేటీఆర్ అసహనానికి కారణం అదే
మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలలో ప్రతిపక్ష పార్టీలపై కేటీఆర్ అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీలను పట్టించుకోని మంత్రి కేటీఆర్, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలను ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చర్చ జరుగుతుంది. బండి సంజయ్, రేవంత్ రెడ్డిల దెబ్బ తట్టుకోలేక కేటీఆర్ గతంలో లేని విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారని చర్చ జరుగుతుంది. మరోపక్క వరంగల్ నగరానికి అభివృద్ధి విషయంలో గతంలో ఎన్నో హామీలు ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం, ఆ హామీలను నెరవేర్చలేదని, ఇక వాటి విషయంలో చెప్పడానికి ఏమీ లేక ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేశారని చర్చ జరుగుతుంది. ఇక జాతీయ పార్టీలను ఎదుర్కోవటంలో కూడా తెలంగాణా లోకల్ స్ట్రాటజీని వాడారు కేటీఆర్.

తెలంగాణా లోకల్ సెంటిమెంట్ రగిల్చే పనిలో కేటీఆర్
ఇదే సమయంలో తెలంగాణ సెంటిమెంటుతో రాష్ట్రాన్ని సాధించి, రెండు దఫాలుగా పరిపాలన సాగిస్తున్న టిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని కూడా మంత్రి కేటీఆర్ వరంగల్ సభలో రివీల్ చేశారనేది జోరుగా జరుగుతున్న చర్చ.
తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కడుపులో ఉండే బాధ జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ నాయకులకు ఉండదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.మన పార్టీనేఉండాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెలంగాణ లోకల్ సెంటిమెంట్ ను రగల్చటంలో భాగంగానే అన్న చర్చ జరుగుతుంది.

మన ఇంటి పార్టీనే మనకు శ్రీరామరక్ష... కేటీఆర్ వ్యాఖ్యల ఆంతర్యం అదే
ఏనాటికైనామన ఇంటి పార్టీనే మనకు శ్రీరామరక్ష అని కేటీఆర్ కొత్త నినాదాన్ని ఎత్తుకోవటం అందుకు ఊతమిస్తుంది . బీజేపీ, కాంగ్రెస్పార్టీలకు 29 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని, కానీ మనకున్నది ఒకే ఒక రాష్ట్రం తెలంగాణా అని మంత్రి కేటీఆర్ చెప్పడం, స్థానిక పార్టీ అని ఫీలింగ్ కలిగించడం కోసం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన సెంటిమెంటుతో, ఆ తర్వాత బంగారు తెలంగాణ సాధిస్తామన్న హామీతో, ఇక ఇప్పుడు ఇంటి పార్టీ అయితేనే శ్రీరామరక్ష అంటూ తెలంగాణ ప్రజలలో లోకల్ సెంటిమెంట్ ను రగిల్చి, జాతీయ పార్టీలకు చెక్ పెట్టాలని కేటీఆర్ భావిస్తున్నారని చర్చ జరుగుతుంది.

సెంటిమెంట్ తో కొట్టి జాతీయ పార్టీలకు చెక్ పెట్టే ప్లాన్ లో కేటీఆర్
అందులో భాగంగానే జాతీయ పార్టీ ల పై విరుచుకు పడి, ఆ రెండు పార్టీలను ఆదరించ వద్దంటూ, మన తెలంగాణ పార్టీ, సొంత పార్టీ అని, అందుకే టీఆర్ఎస్ ను ఆదరించాలని కేటీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంటుతో జనాల్లోకి వెళుతున్నారు. ఒకపక్క ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పై తమ దాడిని పెంచుతుంటే కేటీఆర్ కూడా జనాలలో సెంటిమెంట్ ద్వారా జాతీయ పార్టీలను నిలువరించాలని ప్రయత్నం చేస్తున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications