వివాహితకు లైంగిక వేధింపులు.. సొంత మరిది టార్చర్.. భరించలేక చివరకు..!
ఏటూరు నాగారం : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. సొంత మరిది వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జిల్లాలో చర్చానీయాంశమైంది. భర్త చనిపోయిన తర్వాత మరిది ఆగడాలు ఎక్కువ కావడంతోనే సూసైడ్ చేసుకుందని ఆమె తల్లి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత ఆత్మహత్య.. శంకరాజ్ పల్లిలో విషాదం
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం మండలం శంకరాజ్ పల్లికి చెందిన శ్రీదేవి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె సూసైడ్ చేసుకోవడంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీదేవి మృతికి గల కారణాలను ఆమె సోదరుడు కె.అర్జున్ మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. శనివారం మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడిన అర్జున్.. బావ చనిపోవడంతో తమ సోదరిని ఆయన తమ్ముడు వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు.

అన్న చనిపోవడంతో వదినను వేధిస్తున్నాడనే ఆరోపణలు
శంకరాజ్ పల్లికి చెందిన తాటిపల్లి వెంకటయ్యకు పదమూడేళ్ల కిందట శ్రీదేవితో వివాహం జరిగింది. అయితే నాలుగు సంవత్సరాల కిందట ఆయన గుండె పోటుతో చనిపోయారు. వారికి ఓ బాబు ఉన్నాడు. అయితే వెంకటయ్య చనిపోయిన ఏడాది తర్వాత నుంచి ఆయన తమ్ముడు రామయ్య తమ చెల్లెను వేధిస్తూ వచ్చాడని వాపోయారు శ్రీదేవి అన్న అర్జున్. ఆ క్రమంలో శ్రీదేవిని సూటిపోటి మాటలతో వేధించడమే గాకుండా లైంగికంగా కూడా సతాయించేవాడని చెప్పుకొచ్చారు.

పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ జరిగినా..!
రామయ్య తీరు మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదని.. ఆ క్రమంలో పెద్ద మనుషుల దగ్గర పంచాయితీ పెట్టించినా పద్దతి మార్చుకోలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటవ తేదీన శ్రీదేవి పొలం పనులు చూసుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రామయ్య అడ్డుపడి ఆమెను వాళ్లింటికి తీసుకుపోయాడని ఆరోపించారు. కోరిక తీర్చాలంటూ బలవంతం చేయడంతో శ్రీదేవి ప్రతిఘటించిందని.. ఆ కోపంలో రామయ్యతో పాటు అతడి భార్య పోషమ్మ కలిసి ఆమెపై అఘాయిత్యం చేయబోయారని వివరించారు.

మరిది వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని కేసు..!
దాంతో మనస్థాపానికి గురైన శ్రీదేవి అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో రామయ్య ఇంటి దగ్గరే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. వెంటనే స్థానికులు అప్రమత్తమై ఏటూరు నాగారం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. వరంగల్‌కు తరలించే క్రమంలో చనిపోయిందని తెలిపారు. అమాయకురాలైన తమ చెల్లెను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న రామయ్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అర్జున్. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications