బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా: ఎంపీ కవిత చిందులు.. వధువరులతో కలిసి డ్యాన్స్
బుల్లెట్ బండెక్కి వచ్చేత పా.. అనే సాంగ్‌కి మాములు క్రేజీ లేదు. కొత్త జంట సాయి శ్రీయ, అశోక్ యావత్ ప్రపంచానికి తెలిసిపోయారు. ఇప్పుడు అంతా అదే పాట.. అదే చర్చ.. పలువురు డ్యాన్స్ చేసి వీడియోలను షేర్ చేస్తున్నారు. తాజాగా అధికార పార్టీ ఎంపీ కూడా కాలు కదిపారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మోత..
బుల్లెట్ పాట.. ఎక్కడ చూసినా మారుమోగుతోంది. ఫంక్షన్.. ఆటో, కార్లలో కూడా ఆ పాట మోత మోగుతోంది. పాట వచ్చి చాలా రోజులైనా.. సాయి శ్రీయ డ్యాన్స్‌తో ప్రపంచానికి తెలిసింది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నేత ముత్యం వెంకన్న గౌడ్ కుమారుడి వివాహ వేడుక జరిగింది. ఎంపీ మాలోతు కవిత హాజరయ్యారు. నూతన వధువరూలను ఆశీర్వదించారు. తర్వాత బుల్లెట్ పాట మోత మోగింది. ఇంకేముంది ఎంపీ కూడా స్టెప్పులు వేశారు. అందరినీ ఉత్సాహ పరిచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కవిత దోస్తులు, నేతలు కూడా డ్యాన్స్ చేశారు.
ఓ వివాహ వేడుకలో బుల్లెట్ బండి సాంగ్‌కు స్టెప్పులేసిన ఎంపీ కవిత#oneindiatelugu #kavitha pic.twitter.com/x8ptMmz6Of
— oneindiatelugu (@oneindiatelugu) August 26, 2021
బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా..
పెళ్లి అంటే సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ అయ్యింది. సాయి శ్రీయ వివాహం అశోక్‌తో ఈ నెల 14వ తేదీన జరిగింది. వరుడికి వధువు స్వాగతం పలుకుతూ ఓ పాటకు చిందులేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాట తెలంగాణ మాండలీకంలో అద్భుతంగా ఉంది. ఆ పాటకు వధువు చక్కగా డ్యాన్స్ చేసింది. పెళ్లి కొడుకు వచ్చిన వాహనం ఎదుట పెళ్లి కూతురు స్వయంగా పాట పాడి డ్యాన్స్ చేసింది. వధువు డ్యాన్స్‌ను కాసేపు నవ్వుతూ చూసిన వరుడు ఆ తర్వాత తను కూడా కాలు కదిపాడు. వధువుతో కలిసి డాన్స్ చేసి ఆ తర్వాత ఆగిపోయాడు. ఆ వధువు మాత్రం దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఆ పాటకు డాన్స్ చేస్తూనే ఉంది. వదువు డాన్స్‌ను వరుడు తాపీగా నిలబడి ఎంజాయ్ చేయసాగాడు. చివరలో బంధువులు, స్నేహితులు కూడా వధువుతో కలిసి డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Recommended Video
అల్లారుముద్దుగా పెరిగా..
నా కాబోయే శ్రీవారూ, నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పద అంటూ సరదాగా మొదలయ్యే ఆ పాటలో ఎక్కువగా వధువు గురించే ఉంది. అల్లారుముద్దుగా పెరిగినట్టు, తనను ఎక్కువగా గారాబం చేసి పెంచినట్టుగా వరుడితో వధువు చెప్పుకుంటోంది. పువ్వులా పెరిగాను అయినా నీ చేయి పట్టుకోవడానికి వస్తున్నా అంటూ ఆ పాట సాగుతుంది. మీ అమ్మానాన్నల్ని మా అమ్మానాన్నల్లాగే చూసుకుంటా అంటూ బంధాల గురించి ఆ పాటలో చరణాలు ఉన్నాయి. అందుకే నెట్టింట యూత్‌కు తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాయి శ్రీయ డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఆమె డ్యాన్స్ చక్కర్లు కొడుతోంది. ఆ తర్వాత పేరు, వివరాలు తెలియడంతో ప్రతీ ఒక్కరూ దానినే షేర్ చేస్తున్నారు. అందరూ ఆశీర్వాదం కూడా అందజేస్తున్నారు. నిండు నూరేళ్లు చల్లగా బతుకు అంటూ బ్లెస్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట కరోనా సమయంలో లక్షలాది మంది నుంచి మనస్పూర్తిగా బ్లెస్సింగ్ తీసుకున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications