ర్యాగింగ్‌కు మరో విద్యార్థిని బలి: ఉరివేసుకుని రక్షిత ఆత్మహత్య
వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన మరువకముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో ర్యాగింగ్‌కు మరో విద్యార్థిని బలైంది.
వరంగల్: వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన మరువకముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో ర్యాగింగ్‌కు మరో విద్యార్థిని బలైంది. సీనియర్ల ర్యాగింగ్ కారణంగా నర్సంపేటలోని జయముఖి ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా రక్షిత(20) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఓ విద్యార్థి మరో విద్యార్థితో కలిసివున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మనస్తాపానికి గురై వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

బాధితురాలు రక్షిత.. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, దంపతుల కుమార్తె. ఆమె ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీ మూడవ సంవత్సరం చదువుతోంది.












Click it and Unblock the Notifications