వరంగల్‌కు అరుదైన గుర్తింపు: మోదీ వల్లే.. కాదు కేసీఆర్ వల్లే..!!
హైదరాబాద్: హైదరాబాద్ తరువాత తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందిన వరంగల్‌కు అరుదైన గుర్తింపు లభించింది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) జాబితాలో చేరింది. అరుదైన యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. వరంగల్‌లోని రామప్ప ఆలయానికి వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది.
సరిగ్గా ఏడాది తరువాత యునెస్కో నుంచి మరో అరుదైన గుర్తింపును సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అరుదుగా చెప్పుకొనే యునెస్కో గుర్తింపును ఏడాదికాలంలో రెండుసార్లు సాధించడం ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత. యునెస్కో గుర్తింపు లభించడం పట్ల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి స్పందించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీనికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మోదీ చేసిన కృషి, చూపిన చొరవతోనే ఇది సాధ్యమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ఘన వారసత్వంగా నిలిచిన వరంగల్- యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లల్లో చోటు దక్కడం ఇక్కడి ప్రజల గర్వకారణమని చెప్పారు. తెలంగాణ, వరంగల్ ప్రజలకు జీ కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. యునెస్కో గుర్తింపు రావడం పట్ల ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు.
Warangal joins UNESCO Global Network of Learning Cities ! https://t.co/LP3F8CseJ3@VishalVSharma7 pic.twitter.com/jxR0r7DC0b
— India at UNESCO (@IndiaatUNESCO) September 5, 2022
ఈ గుర్తింపు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ చూపారని అన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి, దార్శనికతతోనే ఇది సాధ్యమైందని మేయర్ గుండు సుధారాణి చెప్పారు.












Click it and Unblock the Notifications