వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం - బావిలోకి దూసుకెళ్లిన జీపు - ప్రయాణికుల కోసం గాలింపు

వరంగల్ రూరల్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 15 మంది ప్రయాణికులతో వరంగల్ సిటీ నుంచి నెక్కొండకు బయలుదేరిన జీపు.. సంగెం మండ‌ల పరిధిలోని గ‌విచ‌ర్ల వ‌ద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. పైన ఎలాంటి సేఫ్టీ వాల్ లేకపోవడం, ఇటీవల కురిసిన వర్షాలకు బావి నిండిఉండటంతో పడటంతోనే అందరూ నీటమునిగారు.

Vehicle with 15 passengers falls into roadside open well near Warangal

ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే స్థానికులు రంగంలోకి దిగి.. ప్రయాణికులను కాపాడారు. 15 మందికిగానూ 12 మందిని స్థానికులు కాపాడగలిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్స్ తో ఘటనా స్థలికి చేరుకున్నారు. గల్లంతైన మరో ముగ్గురు ప్రయాణికుల కోసం గాలింపు చర్య కొనసాగుతున్నది. ప్రమాదం చోటుచేసుకున్న బావి పక్కనే ప్రభుత్వ స్కూలు కూడా ఉండటం గమనార్హం.

Vehicle with 15 passengers falls into roadside open well near Warangal

కాగా, జేసీబీ సాయంతో జీపును బయటికి తీసి, గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. స్థానికులు కాపాడిన 12 మందిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే జీపు అదుపుతప్పి ఉంటుందని భావిస్తున్నారు.

Vehicle with 15 passengers falls into roadside open well near Warangal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+