వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మట్టిలో మాణిక్యం.. పొలం గట్టుపై 150కిలోల బరువు అవలీలగా మోసిన వరంగల్ బాహుబలి!!

|
Google Oneindia TeluguNews

మనసుపెట్టి వెతకాలి కానీ మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది దొరుకుతారు. విభిన్నమైన ప్రతిభాపాటవాలు ఉన్నవారు, శారీరక దారుఢ్యం ఉన్న వారు.. ఏ పనినైనా అవలీలగా చేయగలిగిన వారు నేటికీ అనేక గ్రామాలలో ఎంతో మంది యువకులు ఉన్నారు. ఇక అటువంటి వారి శక్తి అంతా సరైన ప్రోత్సాహం లేక గ్రామాల కే పరిమితం అవుతుంది.

50 కేజీలు ఉన్న 3 యూరియా బస్తాలు అవలీలగా మోసిన యువకుడు


నిజంగా 25 కిలోల బియ్యం బస్తా మొయ్యాలి అంటేనే మా వల్ల కాదు అంటున్న యువత నేటి రోజుల్లో ఎంతోమంది ఉన్నారు. పొరపాటున మోయవలసి వస్తే ఆపసోపాలు పడుతూ ఉంటారు. కానీ వరంగల్ జిల్లాకు చెందిన ఒక యువకుడు 50 కేజీలు ఉన్న 3 యూరియా బస్తాలు తలపై పెట్టుకొని అవలీలగా పొలం గట్లపై నడిచి వెళ్ళాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ యువకుడి స్టామినాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

పొలం గట్టు మీద మూడు బస్తాలను మోసుకుంటూ వెళ్ళిన యువకుడు

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయ పహాడ్ గ్రామ శివారు చంద్రు తండా కు చెందిన నారావత్ అనిల్ తన పొలానికి యూరియా బస్తాలు తీసుకొని వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక్కొక్క బస్తా 50 కిలోల బరువున్న మూడు యూరియా బస్తాలను తలపై పెట్టుకుని పొలం గట్టుమీద కాస్త కూడా అటు ఇటు తొణకక, బెణకక అవలీలగా నడిచి వెళుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

వరంగల్ బాహుబలి ... వీడియో సోషల్ మీడియాలో వైరల్


వరంగల్ బాహుబలి అంటూ ఆ యువకుడిని కొనియాడుతున్నారు. ఇంకా కొంత మంది నెటిజన్లు ఆ యువకుడు గట్టు మీద అంత బరువుతో నడవటం చూసి పడితే ఇంకా ఏమైనా ఉందా అంటూ అవాక్కవుతున్నారు. అతనికి సరైన ప్రోత్సాహం ఇస్తే మంచి బాడీ బిల్డర్ గా కానీ, బాక్సర్ గా కానీ రాణిస్తాడు అని చెప్తున్నారు. ఇక అనిల్ కు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన బాక్సింగ్ అసోసియేషన్ కోచ్ లు అనిల్ వద్దకు వెళ్లి బాక్సింగ్ ట్రైనింగ్ ఇస్తామని మాట్లాడారు.

బాక్సింగ్ అంటే ఇష్టం అంటున్న యువకుడు .. సహకరిస్తే రాణిస్తానని చెప్తున్న అనిల్

బాక్సింగ్ అంటే ఇష్టం అంటున్న యువకుడు .. సహకరిస్తే రాణిస్తానని చెప్తున్న అనిల్


ఇక అనిల్ కూడా తనకు బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టమని, ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకున్న పరికరాలతో నిత్యం వ్యాయామం చేస్తానని చెబుతున్నాడు. పెద్ద బాక్సర్ కావాలన్నదే తన ఆశయమని అనిల్ చెబుతున్నాడు. కాస్త సహకరిస్తే బాక్సింగ్ లో అద్భుతాలు చూపిస్తానని అనిల్ చెప్తున్నాడు. మరి మారుమూల తండా ప్రాంతానికి చెందిన ఈ యువ బాక్సర్ కల నెరవేరుతుందా లేదా అనేది వేచి చూడాలి.

English summary
A video of a young man named Anil from Chennaraopet of Warangal district carrying a 150 kg weight on the embankment of the farm has gone viral on social media. Netizens are hailing him as Baahubali of Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X