• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులను విదేశాలకు పంపుతున్న కన్సల్టెన్సీలపై వరంగల్ పోలీసుల ఉక్కుపాదం

|
Google Oneindia TeluguNews

వరంగల్ కమిషనరేట్ పోలీసులు నెల రోజుల వ్యవధిలోవివిధ యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న రెండు గ్యాంగ్ లను పట్టుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేశారు. తాజాగా మరో ఐదుగురు సభ్యుల ముఠాను గుర్తించిన పోలీసులు ఈ గ్యాంగ్ లో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల ద్వారా వీరు విదేశీ యూనివర్సిటీలకు విద్యార్థులను పంపే కన్సల్టెన్సీ లను నిర్వహిస్తున్నారని సమాచారం . మిగతా ముగ్గురు అభ్యులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

నకిలీ యూనివర్సిటీల సర్టిఫికెట్లతో కన్సల్టెన్సీలను నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

నకిలీ యూనివర్సిటీల సర్టిఫికెట్లతో కన్సల్టెన్సీలను నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

వివరాల్లోకి వెళితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు పంపిస్తున్న 5 మంది సభ్యుల ముఠాను వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇక ఈ ముఠా సభ్యుల నుండి దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 22 నకిలీ సర్టిఫికెట్లు, 1ల్యాప్ ట్యాప్ , 3 ప్రింటర్లు, 5 సిపియూలు, 3 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ యూనివర్సిటీల సర్టిఫికెట్లతో కన్సల్టెన్సీలను నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

నకిలీ యూనివర్సిటీల సర్టిఫికెట్లతో కన్సల్టెన్సీలను నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించిన వివరాల మేరకు, పోలీసులు అరెస్టు నిందితులు హన్మకొండ, హైదరాబాద్ నగరాల్లో కన్సల్టెన్సీ సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల ద్వారా వచ్చే ఆదాయం వారి జీవనానికి సరిపోకపోవడంతో, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవాలని భావించి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా నిందితులిద్దరు విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే వ్యక్తులు, విద్యార్థులకు ఎలాంటి విద్యార్హతలు లేకున్నా తమకు కావల్సిన విద్యాసంస్థలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను ప్రస్తుతం పరారీలో వున్న శ్రీకాంత్ రెడ్డి ద్వారా సమకూర్చుకోనేవారు. ఈ నకిలీ సర్టిఫికేట్ ను వినియోగించుకోని నిందితులిద్దరు తమ కన్సల్టెన్సీ సంస్థల ద్వారా విద్యార్థులను ఎలాంటి విద్యార్హత లేకున్న విదేశాలకు పంపేవారు.

 హన్మకొండ, హైదరాబాద్ నగరాల్లో కన్సల్టెన్సీ సంస్థలు నిర్వహిస్తున్న కేటుగాళ్ళు

 నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు విద్యార్థులను పంపే కన్సల్టెన్సీల దందా

నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు విద్యార్థులను పంపే కన్సల్టెన్సీల దందా

అదే విధంగా ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారు చేసే ఈ ముఠా చాలా విదేశీ యూనివర్సిటీలు కనీస మార్కుల శాతాన్ని తప్పనిసరి చేయడంతో విదేశాల్లో చదవాలనే ఉత్సహంతో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు మార్కులను కూడా ఫేక్ చేసి సర్టిఫికెట్ లను తయారు చేసి ఇచ్చేవారు. అలాగే కొన్ని విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన వుండాలని విదేశీ విశ్వ విద్యాలయాలు విద్యార్థులకు నియమం పెట్టడంతో ఈ నియమాన్ని సైతం ముఠా సభ్యులు తమ అనుకూలంగా మార్చుకోని వివిధ సెమిస్టర్లలో ఫెయిల్ అయిన మొదటి ప్రయత్నంలోనే పాస్ కాని విద్యార్థులకు సైతం మొదటి ప్రయత్నంలోనే పాస్ అయినట్లుగా నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసి అందజేసారు. ఈ విధంగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విధ్యార్థులను విదేశాలకు పంపించేందుకుగాను అవసరమయిన పత్రాలను రూపొందించినందుకుగాను ఈ ముఠా ఒక లక్ష రూపాయల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు డబ్బును వసూలు చేసేవారు.

నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు పంపటం నేరం..పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న సీపీ

నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు పంపటం నేరం..పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న సీపీ

ఈ వ్యవహారానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ కు సమాచారం అందడంతో టాస్క్ఫర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠా కార్యకలపాలపై ప్రత్యేక నిఘా కొనసాగించింది. ఇందులో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులకు సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థలపై దాడులు నిర్వహించడంతో ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారి వ్యవహారం బయటపడిందని సీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను నకిలీ సర్టిఫికెట్లతో విదేశాల్లో చదివించేందుకు పంపడం నేరం అని అంతేకాదు అలాంటి తప్పులు చేస్తే విధ్యార్థి పేరును బ్లాక్ లిస్ట్ లో పెట్టడం ద్వారా భవిష్యత్తులో మరెక్కడా చదివేందుకు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉండదని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

English summary
Warangal Commissionerate police have nabbed a gang who were forging certificates of various recognized universities in the country and sending students abroad through their consultancies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X