వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రెసిడెన్షియల్ సూట్‌ నుంచి వ్యూ పాయింట్: నరసింహుడి వీక్షణ. అద్భుతం అంటున్న రోజా..

|
Google Oneindia TeluguNews

జిల్లాల పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు. నిన్న జనగామ టూర్ పూర్తవగా.. ఇవాళ యాదాద్రికి వచ్చారు. అక్కడ కొత్తగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, వీవీఐపీ కాటేజీలు, విల్లాలను ప్రారంభించి.. పరిశీలించారు. తర్వాత యాదాద్రి యాగశాలను ఆయన పరిశీలించనున్నారు. భువనగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభిస్తారు. టీఆర్ఎస్ జిల్లా ఆఫీసును ప్రారంభించి.. కలెక్టరేట్ పక్కన జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. ప్రెసిడెన్షియల్ సూట్ ను 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. లక్ష్మీనృసింహుడి ఆలయ వీక్షణ కోసం అందులో ప్రత్యేకంగా ఒక వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. యాదాద్రి చిన్నకొండపై 14 విల్లాలు, ఒక మెయిన్ సూట్ 13.25 ఎకారల్లో నిర్మించారు.

యాదాద్రి ఆలయం నిర్మాణం అద్భుతం.. ఈ కాలంలో ఎవరికీ దక్కని అవకాశం సీఎం కేసీఆర్ కు దక్కిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె శనివారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్బుతంగా నిర్మిస్తున్నారని కొనియాడారు. గతంతో పోలిస్తే చక్కగా ఇప్పుడు ఆలయాన్ని డిజైన్ చేసి పునః నిర్మాణం చేశారన్నారు. భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నారని ఆమె పేర్కొన్నారు.

ysrcp mla roja offered prayers to yadadri laxminarashimha swamy

గుడి కట్టాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాలని రోజా అన్నారు. అందరి సహకారంతో, దేవుడి ఆశీస్సులతో ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. నిర్మాణంలో ఉపయోగించిన రాయి గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చారన్నారు. ఇరు రాష్ట్రాల అన్నాదమ్ముళ్లు, అక్కా చెల్లెల్లుగా కలిసే ఉంటారని రోజా కామెంట్ చేశారు. తండ్రి సమానులైన సీఎం కేసీఆర్ సంతోషంగా ఉంటూ, ప్రజలను సంతోషంగా ఉంచేలా చూడాలని తాను స్వామి వారిని కోరుకున్నానని రోజా వెల్లడించారు.

Recommended Video

Vizag Railway Zone పై క్లారిటీ , Special Status పేరుతో AP కి అన్యాయం | Oneindia Telugu

లక్ష్మీ నరసింహా స్వామి.. సీఎం కేసీఆర్ ఇలవేల్పు.. అందుకే స్వామి వారి ఆలయాన్ని పున: నిర్మించారు. అయితే ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఉండగా.. తెలంగాణలో కూడా యాదాద్రిని డెవలప్ చేస్తున్నారు. అక్కడ రియల్ భూమ్ కూడా ఊపందుకుంది. సకల సౌకర్యాలను కల్పిస్తున్నా

English summary
ysrcp mla roja offered prayers to yadagiri gutta lakshmi narasimha swamy. she praises cm kcr for reconstructed temple
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X