పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శీర్షాసనంలో శివుడు.. పార్వతీదేవి.. కుమరస్వామి కూడా.. ఎక్కడ అంటే..

|
Google Oneindia TeluguNews

శివుడు లింగ రూపంలో దర్శనం ఇచ్చే ఆలయాలే ఎక్కువగా ఉంటాయి. కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో ఉంటారు. అరుదైన ఆలయాలు కొన్నే ఉంటాయి. శక్తీశ్వరాలయం ఒకటి. ఇక్కడ శివుడు విగ్రహరూపంతోపాటు తలక్రిందులుగా దర్శనం ఇవ్వటం ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావారి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో శక్తీశ్వరాలయం ఉంది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరానికి 7కిలోమీటర్ల దూరంలో యనమదుర్రు శక్తీశ్వరాలయం ఉంది. ఒకే రాతిపై పార్వతీదేవి, శివుడు ఇద్దరు భక్తులకు దర్శనం ఇస్తుంటారు. పార్వతీదేవి ఒడిలో చిన్నారి బాలుడి రూపంలో కుమారస్వామి ఉంటారు.

రెండు స్థల పురాణాలు..

రెండు స్థల పురాణాలు..

తూర్పు చాళుక్యులు ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈ క్షేత్రానికి రెండు స్థల పురాణాలు ఉన్నాయి. యముడు మోక్షం కోసం ఈ క్షేత్రంలో తపస్సు చేశాడట. శంబరుడు అనే పరమశివ భక్తుని ప్రాణాలు తీసేందుకు శివుడి అనుమతి కోసం యముడు తపస్సు చేయటానికి కారణం. శివుడు శీర్షానంలో కైలాసంలో తపస్సు చేస్తుంటాడు. పార్వతి దేవి కుమారస్వామిని ఒడిలో లాలిస్తుంటుంది. యముడు తపస్సు క్రమంలో ఉన్నపళంగా శివపార్వతులు యధాస్ధితిలో ప్రత్యక్షం అవ్వాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ శివుడు శీర్షాసనంలో పార్వతిదేవి చిన్నారి కుమారస్వామిని లాలించే రూపంలో దర్శనమిస్తారని స్ధలపురాణం ద్వారా తెలుస్తోంది. ప్రత్యక్షమైన శివుడు యముడికి ఒక వరం కూడా ఇచ్చాడట. నీ పేరుమీద ఒక గ్రామం.. అందులో ఒక శివాలయం వెలుస్తుందని, అప్పడు నీపై ఉన్న అపప్రద తొలిగిపోతుందని చెప్తాడు. అందుకే ఈగ్రామాన్ని యనమదుర్రుగా పేరు వచ్చిందని చెప్తుంటారు.

రెండో కథ

రెండో కథ

రెండో కథ విషయానికి వస్తే.. శంబిరుడు అనే రాక్షసరాజు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. మునులంతా యమధర్మరాజు వద్దకు వెళ్లి తమ బాధలు చెప్పుకుంటారు. చిత్రగుప్తుడు శంబిరుడి ఆయువును లెక్కవేసి యముడికి సమాచారం అందిస్తాడు. శంబిరుడి ఆయువు త్వరలో తీరుపోతుందని దీంతో అతి త్వరలో ఆ రాక్షసుడిని సంహరిస్తారని యముడు వారికి చెబుతాడు. శంబిరుడు ఈశ్వరుడి పరమ భక్తుడు. గతంలో ఈశ్వర ఆజ్జ ప్రకారం ఈశ్వరుడి భక్తులను సంహరించాలంటే ముందుగా ఈశ్వరుడి అనుమతి తీసుకోవాలి. దీనిని జ్జప్తికి తెచ్చుకున్న యముడు యమనదుర్రులో ఘోర తప్పస్సు చేసి ఉన్నఫళంగా ప్రత్యక్షం కావాలని లేదంటే లోక వినాశనం తప్పదని శివుడిని వేడుకుంటాడు.

Recommended Video

మహాశివరాత్రి ఉత్సవాల్లో Ys Jagan.. వేదపండితుల సమక్షంలో..!! || Oneindia Telugu
శీర్షాసనంలో శివుడు

శీర్షాసనంలో శివుడు


ఆ సమయంలో కూడా శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తుంటాడు. ఆయన పక్కనే పార్వతీ దేవి కుమారస్వామిని ఒడిలో లాలిస్తుంటుంది. దీంతో పార్వతికి విషయం చెప్పి పరమశివుడు అదే స్థితిలో యముడికి ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడ శివుడు శీర్షాసన స్థితిలో కనిపిస్తాడని శివపురాణం చెబుతోంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని చెప్తారు. అందుకే దూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.

English summary
lord shiva statue at west godavari district yanamaduru. devotees are offer prayers to shiva.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X