పశ్చిమ గోదావరి జిల్లాలో జల్లేరువాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 8 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలంలో ఓ ఆర్టిసి బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు పడిపోయింది. అదుపు తప్పి పడ్డ ఆర్టీసి బస్సు వాగులో పడిపోయిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ బస్సు వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాద ఘటన చోటు చేసుకుంది.

జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు .. 8 మంది మృతి
> ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జల్లేరు వాగులో పడిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చనిపోగా మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారిని జంగారెడ్డి గూడెం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 47 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు వాగులో పడిపోవటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

రెయిలింగ్ ను ఢీకొట్టడంతో జల్లేరు వాగులో బోల్తా
> అశ్వరావుపేట నుండి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే జంగారెడ్డిగూడెం నుంచి బస్సు చేరుకుంటుంది అనుకున్న సమయంలో బస్సు రెయిలింగ్ ను ఢీకొట్టడంతో జల్లేరు వాగులో బోల్తా పడిపోయింది. బస్సు వాగులో ఒకవైపుకు పడడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గాయాలతో బయటపడగా, కండక్టర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం .
>

మృతులు ఎక్కువగా మహిళలు, పిల్లలు .. కొనసాగుతున్న సహాయక చర్యలు
> ఆర్టీసీ బస్సు వాగులో పడిపోయిన ఘటనలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. బస్సు నీటిలో పడడంతో, బస్సులో నుండి బయటకు రాలేక 8మంది మృతి చెందినట్టు సమాచారం. స్థానికులు బస్సులో ఉన్న మిగతా వారిని సురక్షితంగా పడవల సహాయంతో బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఆర్డీవో, డీఎస్పీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications