వరల్డ్ కప్ కోసం గంగూలీ డ్రీమ్ టీమ్- జట్టు కూర్పు ఇలాగే ఉండాలట..!!
ముంబై: ఇంకో మూడు నెలల్లో బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ ఐసీసీ వరల్డ్ కప్ ఆరంభం కాబోతోంది. దీనికోసం క్రికెట్ ఆడే అన్ని దేశాలు సన్నద్ధమౌతోన్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌తో తీరిక లేని షెడ్యూల్స్‌ను ఎదుర్కొంటోన్నాయి. ఇది 13వ ఎడిషన్ వరల్డ్ కప్. ఇప్పటివరకు 12 మెగా టోర్నమెంట్లు ముగిశాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే.. తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.

ఈ టోర్నమెంట్ మొత్తం మీద 58 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో 10 వార్మప్స్. దేశంలో 12 స్టేడియాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోన్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌కు మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలు గురువారం నుంచే మొదలు కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది బీసీసీఐ.
వరల్డ్ కప్ ఆడబోయే టీమిండియా ఎలా ఉండాలనే విషయంపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. లెజెండరీలు, మాజీలు.. తమ అభిప్రాయాలను తెలియజేస్తోన్నారు. జట్టు కూర్పు పట్ల తమకు తోచిన అడ్వైజ్‌లను ఇస్తోన్నారు. సత్తా, ఒత్తిడిని ఎదుర్కొనే టాలెంట్ ఉన్న ప్లేయర్లకే జట్టులో చోటు కల్పించాలనేది వారి ఉద్దేశం.

తాజాగా టీమిండియా మాజీ కేప్టెన్, బీసీసీఐ మాజీ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ.. తన డ్రీమ్ టీమ్‌ను ప్రకటించారు. బ్యాకప్ ప్లేయర్లను కూడా ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో కూడిన జట్టు అది. మరో ముగ్గురిని బ్యాకప్స్‌గా సెలెక్ట్ చేశాడు. కీలక ప్లేయర్లు, వన్డే స్పెషలిస్టులు ఇందులో మిస్ అయ్యారు.
గంగూలీ పిక్ చేసిన ఈ టీమ్‌లో- రోహిత్ శర్మ (కేప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కేప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు. బ్యాకప్: ప్రసిద్ధ్ కృష్ణ, తిలక్ వర్మ, యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేశారు.












Click it and Unblock the Notifications