వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

WTC final: రెడ్ ఛెర్రీ బాల్ ఫస్ట్‌లుక్: ఆ ఫ్లేవర్..స్పెషాలిటీ అదే: కేన్ మామ ఫుల్ జోష్

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC final) ఫీవర్ క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇంకొక్కరోజే గ్యాప్. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు తొలి బంతి పడబోతోంది. క్రికెట్ ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం ఈ ఇంగ్లాండ్‌ సౌథాంప్టన్‌‌లోని రోజ్ బౌల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. రెండు జట్లూ సన్నాహాక మ్యాచ్‌లను ఆడేశాయి. అసలు సిసలు పోరు కోసం ఎదురు చూస్తోన్నాయి. నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోన్నాయి.

హై ఓల్టేజ్ మ్యాచ్‌గా..

హై ఓల్టేజ్ మ్యాచ్‌గా..


అటు బ్లాక్ క్యాప్స్.. ఇటు టీమిండియా ఫైనల్ 15 స్క్వాడ్‌ను కూడా ప్రకటించాయి. మచ్ అవైటెడ్, హైఓల్టేజ్ మ్యాచ్‌గా గుర్తింపు పొందిన సౌథాంప్టన్ టెస్ట్ కోసం గంటలు లెక్కపెడుతోన్నారు అభిమానులు. ఫైనల్ మ్యాచ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. దీనిపై అంచనాలు పెరుగుతోన్నాయి. డిబేట్లు వెల్లువెత్తుతోన్నాయి. ప్రిడిక్షన్లు జోరందుకున్నాయి. మాజీ క్రికెటర్లు జ్యోతిష్యుల అవతారం ఎత్తారు. ఏ జట్టు గెలుస్తుందో.. జోస్యం చెబుతున్నారు. ఈ జ్యోతిష్య ఫలితాలు ఎలా ఉంటాయనేది రెండో ఇన్నింగ్ ఆరంభమైతే గానీ తెలియదు.

రెడ్ బాల్ ఫస్ట్‌లుక్..

రెడ్ బాల్ ఫస్ట్‌లుక్..

ప్రస్తుతానికి టీమిండియా, కివీస్ జట్లు రెండూ సమవుజ్జీలుగా ఉంటోన్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై ఆ దేశ జట్టును ఓడించడం ద్వారా ఓ అడుగు ముందే ఉంది న్యూజిలాండ్. అదలా ఉంటే- డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో వాడబోయే బాల్ ఫస్ట్‌లుక్ విడుదలైంది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు దీన్ని బయట పెట్టింది. తమ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఓ బాక్స్‌లో మిళమిళమెరుస్తూ కనిపిస్తోన్న ఎరుపురంగు ఛెర్రీ బాల్ ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందా టీమ్ మేనేజ్‌మెంట్.

ఫొటోలకు ఫోజులిస్తూ కేన్ మామ..

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ 2021 భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (ICC WTC Final 2021 India vs New Zealand) అని రాసి ఉందా బాల్ మీద. అలాగే- ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) లోగోను ముద్రించి ఉంది. ఛెర్రీ ఫ్లేవర్‌ను దీని తయారీలో వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ బాల్‌తో పాటు డ్రెస్సింగ్‌రూమ్‌లో హ్యాంగర్‌కు తగిలించి ఉన్న కివీస్ ఆటగాళ్ల జెర్సీ ఫొటోలను కూడా ఆ జట్టు మేనేజ్‌మెంట్ పోస్ట్ చేసింది. జట్టు కేప్టెన్ కేన్ విలియమ్సన్.. బ్యాట్ పట్టుకుని.. ఓ స్టూల్ మీద కూర్చుని ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించాడు. అలాగే టిమ్ సౌథీ కొత్త జెర్సీ ధరించి ఫొటోలకు ఫోజులిచ్చాడు.

కివీస్ టీమ్ ఇదే..

కివీస్ టీమ్ ఇదే..

తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీని ఊది అవతల పారేసిన డెవాన్ కాన్వేకు ఈ జట్టులో చోటు దక్కింది. కేన్ విలియమ్సన్‌ను జట్టు కేప్టెన్‌గా కొనసాగించింది. కేన్‌ విలియమ్సన్, టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, కొలిన్ డీ గ్రాండ్‌హోమ, మ్యాట్ హెన్రీ, కైలే జెమిసన్, టామ్ లాథమ్, హెన్రీ నికొల్స్, ఇజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్‌లను జట్టులోకి తీసుకుంది. వారిలో బీజే వాట్లింగ్ రెగ్యులర్ వికెట్ కీపర్ కాగా.. అదనంగా టామ్ బ్లండెల్‌కు చోటు దక్కింది. ఈ 15 మందిలో తుది జట్టులోకి ఎవరెవర్ని తీసుకుంటారనేది మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే తెలుస్తుంది.

English summary
New Zealand revealed the first look of the Red Cherry ball that will be used in the WTC final. The 'red cherry' has 'ICC WTC Final 2021 India vs New Zealand' written on it, accompanied by the ICC logo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X