Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంగారం ధరల్లో పెను మార్పుకు ఈ వారమే కీలకం.. తగ్గుతుందా లేక పెరుగుతుందా.. తీవ్ర ఉత్కంఠలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భగ్గుమన్నాయి. మొన్నటి దాకా నేల చూపులు చూసిన పసిడి ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయిన వేళ బంగారం ధరలు పెరగడంతో మధ్యతరగతి వారు ఆందోళన చెందుతున్నారు. బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. పెట్టుబడిదారులు కూడా జాగ్రత్త పడుతున్నారు. మళ్లీ ధరలు పడిపోతే ఎక్కడ నష్టపోతామోనని ఆలోచన చేస్తున్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి.ఈ నేపథ్యంలో పసిడి ధరల మార్పు అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు.

అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, జీడీపీ డేటా, పీఎంఐ రిపోర్టులు, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు వంటి కీలక ఆర్థిక సమాచార విడుదలకు ముందు బులియన్ మార్కెట్‌లో జాగ్రత్త వాతావరణం నెలకొంది. వచ్చే వారం బంగారం ధరలు స్థిరంగా కదలాడే అవకాశం ఉందని.. అయితే వెండి ధరలు మరింత హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


Gold price prediction silver rate forecast gold silver correction gold price today silver price today precious metals outlook gold market warning silver market analysis gold price fall silver price decline bullion market forecast gold silver volatility analysts warning gold silver weekly gold price outlook silver price prediction this week MCX gold forecast MCX silver outlook global bullion market dollar impact on gold interest rate impact on silver MCX MCX

గత వారం అంతర్జాతీయ మార్కెట్లో కోమెక్స్‌లో బంగారం బలమైన రికవరీని చూపించింది. ఔన్సుకు సుమారు 4,400 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి దాదాపు 5 వేల డాలర్ల వరకు ఎగబాకి.. వారాంతంలో దాదాపు 5 శాతం లాభాన్ని నమోదు చేసింది. దీని వెనుక ప్రధానంగా షార్ట్ కవరింగ్, విలువ ఆధారిత కొనుగోళ్లు, సేఫ్-హెవెన్ డిమాండ్ కొంత మేరకు తిరిగి రావడం కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే వెండి పరిస్థితి భిన్నంగా ఉంది. గత వారంలో వెండి ఫ్యూచర్స్ ధరలు సుమారు 2 శాతం క్షీణించాయి. భారీ ఊహాజనిత పొజిషన్లు, మార్జిన్ కాల్స్, లిక్విడేషన్ ఒత్తిడి వెండిపై ఎక్కువ ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పారాబోలిక్ ర్యాలీ తర్వాత సహజంగా వచ్చే దిద్దుబాటు దశలో వెండి ప్రస్తుతం ప్రయాణిస్తోందని వారు చెబుతున్నారు.

వచ్చే వారం మార్కెట్ల దిశను నిర్ణయించడంలో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుదల సంకేతాలు ఇస్తే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలపై అంచనాలు బలపడే అవకాశం ఉంది. అదే జరిగితే బంగారం ధరలకు మద్దతు లభించవచ్చు. మరోవైపు, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉంటే డాలర్ బలపడే అవకాశం ఉంది, ఇది బులియన్‌పై ఒత్తిడిని పెంచవచ్చు.

బంగారం ధరలు ఈ రోజు భారీగా పెరిగాయి.. కొనుగోలు వెంటనే ఆపేయండి.. ఫిబ్రవరి 9, సోమవారం ధరలు ఇవే..

చైనా, జర్మనీ, భారత్ నుంచి వచ్చే ద్రవ్యోల్బణ డేటాను కూడా వ్యాపారులు నిశితంగా గమనిస్తున్నారు. ముఖ్యంగా చైనాలో భౌతిక బంగారం, వెండికి డిమాండ్ పరిస్థితులు ఆసియా మార్కెట్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపనున్నాయి. చైనాలో పండుగల కాలానికి ముందు భౌతిక డిమాండ్ స్థిరంగా ఉండటం కొంత మేరకు వెండికి మద్దతు ఇవ్వవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గత వారం Gold ధరలు నేడు గణనీయంగా పెరిగాయి, అదే సమయంలో వెండి భారీగా పడిపోయింది.

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుల ప్రకారం.. ఇటీవల బంగారం, వెండి రెండింటిలోనూ దశాబ్దాల తరువాత చూడని స్థాయిలో దిద్దుబాట్లు నమోదయ్యాయి. అయితే తీవ్ర అమ్మకాల తర్వాత ఇప్పుడు స్థిరీకరణ సంకేతాలు కనిపిస్తున్నాయని.. ముఖ్యంగా బంగారంలో డిప్స్‌పై కొనుగోళ్లు తిరిగి వస్తున్నాయని వారు చెబుతున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి పూర్తిగా తొలగిపోకపోవడం, సెంట్రల్ బ్యాంకులు Gold నిల్వలను పెంచడం, ETF పెట్టుబడులు కొనసాగడం వల్ల దీర్ఘకాలికంగా బంగారం ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. అయితే స్వల్పకాలంలో డేటా ఆధారిత హెచ్చుతగ్గులు కొనసాగుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Credit: Goodreturns

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+