అట్లాంటాలోని స్థానిక శివమందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దాదాపు 400మంది ప్రవాసాంధ్ర అయ్యప్ప భక్తులు పాల్గొని అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. వర్జీనియా, దక్షిణ కారోలినా, టిన్నెస్సీ అలబామా, ఫ్లోరిడా తదితర రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుస్వాములు ముదిగొండ కిరణ్, మేడిచెర్ల రవికుమార్‌లు పూజా కార్యక్రమం నిర్వహించారు. పడిపూజ, సంకీర్తనలు, శోభయాత్ర, శివహారతి, 18మెట్ల హారతితో కార్యక్రమాలు ముగిశాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేందర్ ధార్, చేగు బలరామయ్య, సత్తిరాజు సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.