అమెరికాలో ఇళయరాజా పాటల పందిరి

ప్రముఖ శాక్సోఫోనిస్ట్ రమేష్ మరాజ్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాత పాటలకు సముచిత గౌరవ స్థానం కల్పించాలనే ఒక సత్సంకల్పంతో సంగీత విభావరి కార్యక్రమం మొదలు పెట్టామని చిమటమ్యూజిక్.కామ్ అధినేత శ్రీనివాసరావు చిమట వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతంమవడానికి సహాయపడిన స్పాన్సర్లకు, వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని సమన్వయకర్తలు శ్రీనివాస్ చిమట, రమణ ఈడూరి, వంశీ నాదెళ్ల, ప్రసాద్ మంగినలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాటల పోటీలో విజేతలైన అమృత తుర్లపాటి, శ్రియ అరవీటి శ్రేయ బుద్ధవరపు, నవ్యమైత్రి కొండా, పూజిత దశిక, నిత్య కస్తూరి, కార్తీక్ నూలి, శైలజ భాగవతుల, శ్రీనివాస్ వారణాసిలకు బహుమతలు అందజేశారు.












Click it and Unblock the Notifications