అమెరికాలో దండి యాత్ర

కామన్ వెల్త్ క్రీడలు, ఆదర్శ్ హౌసింగ్, మైనింగ్ లీజుల కుంభకోణాల వంటి అవినీతి కార్యక్రమాల నేపథ్యంలో అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర సాగింది. అవినీతిని అరికట్టడానికి జన్ లోక్‌పాల్ బిల్లు తేవాలని వారు డిమాండ్ చేశారు. కరప్షన్ కో హటానా హై.. భారత్ కో బచానా హై వంటి నినాదాలు చేశారు. దండియాత్ర ముగింపు కార్యక్రమానికి పెద్ద యెత్తున ఎన్నారైలు హాజరయ్యారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో 150 మంది, సియాటిల్‌లో 100 మంది, న్యూజెర్సీలో వంద మంది, హూస్టన్‌లో వంద మంది, కార్బొండేల్‌లో 70 మంది దండియాత్ర సందర్భంగా సమ్మేళనాలు నిర్వహించారు. భారతదేశంలోని ముంబై, బెంగళూర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కత్తా, భువనేశ్వర్, నాగపూర్, అహ్మదాబాదు వంటి నగరాల్లో కూడా దండియాత్ర కార్యక్రమాలు సాగాయి. దండియాత్ర ముగింపు సందర్భంగా జవహర్ కంభంపాటి శాన్ ఫ్రాన్సిస్కోలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అన్నా హజారే ఏప్రిల్ 5వ తేదీన ఢిల్లీలో తలపెట్టిన దీక్షకు సుభాష్ కర్రి తదితరులు పాల్గొనడానికి సమాయత్తమవుతున్నారు.












Click it and Unblock the Notifications