వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో జయశంకర్‌కు యాష్కీ సంతాపం

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే జయశంకర్ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి తాను మరింత కృషి చేస్తానని మధు యాష్కీ చెప్పారు. తెలంగాణ సాధించడం ద్వారా జయశంకర్‌కు నివాళి అర్పించడానికి ఎన్నారైలంతా ఏకం కావాలని సుధాకర్ పెర్కారీ సూచించారు. జయశంకర్ కోసం సుద్దాల అశోక్ తేజా రాసిన పాటను హరి ముడుంబ, శ్రవణ్ ఆలపించారు. సురేందర్ మద్ది జయశంకర్ అమెరికా పర్యటనలను గుర్తు చేసుకున్నారు.
తాను కాళోజీని తాత అని, జయశంకర్‌ను అంకల్ అని పిలిచేదాన్ననని వర్ష చెప్పారు. అంకల్ లక్ష్య సాధన కోసం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. జయశంకర్ జ్ఞాపకాలను పంచుకోవడానికి సమావేశానికి వచ్చిన వారందరికీ టిడిఎఫ్ అధ్యక్షుడు మురళి చింతలపణి కృతజ్ఞతలు తెలిపారు.