వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహ్రెయిన్‌లో భారతీయుడి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
బహ్రెయిన్‌ ఆందోళనల్లో భారత మాజీ సైనికోద్యోగి ఒకరు మృతి చెందాడు. రాజధాని మనామాలో ప్రైవేటు భద్రతా అధికారిగా పనిచేస్తున్న కేరళకు చెందిన స్టీఫెన్‌ అబ్రహం (40) సైనిక దళాల కాల్పుల్లో చనిపోయినట్లు తెలిసింది. ఏడాది కిందట భారత సైన్యంలో పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి ఆయన బహ్రెయిన్‌లో పనిచేస్తున్నారు. గత బుధవారం ఆందోళనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో భవనంపైన ఉన్న స్టీఫెన్‌ బుల్లెట్లు తగిలి మృతి చెందినట్లు బంధువులు వెల్లడించారు. ఈ విషయాన్ని స్టీఫెన్‌ పనిచేసే సెక్యూరిటీ ఏజెన్సీ తెలియజేసిందని చెప్పారు.

మరోవైపు బహ్రెయిన్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నందున జాగ్రత్తగా ఉండాలని అక్కడ నివసిస్తున్న భారతీయులకు ప్రభుత్వం సూచించింది. ముందస్తుగా ఆహార పదార్థాలు, సరుకులను పెద్దమొత్తంలో నిల్వ చేసుకోవాలని, ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని సూచించింది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని బహ్రెయిన్‌లో భారత రాయబారి మోహన్‌ కుమార్‌ తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని అక్కడి ప్రవాసులకు విదేశాంగ శాఖ కూడా సూచించింది. బహ్రెయిన్‌లో సుమారు 3 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.

English summary
An Indian has been killed in crossfire in unrest-hit Bahrain. “Stephen Abraham lost his life in a crossfire in Bahrain. Our embassy is in touch with Bahrain authorities who are cooperative,” the External Affairs Ministry said on Friday. Abraham, 40, worked as a private security officer in Bahrain’s capital Manama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X