నాట్యాచార్యుడి మృతికి ఎన్నారైల సంతాపం

కూచిపూడి నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తేవడంలో వెంపటి చినసత్యం సేవలు మరువలేనివని ఆటా ప్రశంసించింది. మద్రాసులో 1963లో ఆయన కూచిపూడి ఆర్ట్ అకాడమీని ప్రారంభిన విషయాన్ని గుర్తు చేసింది. ఆయన ఈ అకాడమీలో 180కి పైగా సోలో ఐటమ్స్, 15 డ్యాన్స్ డ్రామాలను రూపకల్పన చేసిన విషయాన్ని ఆటా ప్రస్తావించింది.
వెంపటి చిన సత్యం మృతికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కూడా సంతాపం వ్యక్తం చేసింది. కూచిపూడి నృత్యాన్ని దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ వెంపటి చిన సత్యం ప్రచారం చేశారని, జీవితాన్ని ఆయన కూచిపూడికి అంకితం చేశారని నాట్స్ చెప్పింది. 1984లో మైమీ మేయర్ ఆయనకు గోల్డెన్ కీ అందించిన విషయాన్ని గుర్తు చేసింది. 1994 సెప్జెంబర్ 24వ తేదీని ఓహ్యో డేటన్ ఆప్ మేయర్ వెంపటి చిన్న సత్యం రోజుగా ప్రకటించారని చెప్పింది.
1994 నంబర్ 3వ తేదీని ఆట్లాంటా మేయర్ కూచిపూడి నాట్య దినోత్సవంగా ప్రకటించారని గుర్తు చేసింది. 1994 సెప్టెంబర్ 24వ తేదీని మెంఫిస్ మేయర్ రామాయణం దినోత్సవంగా ప్రకటించి, కీ ఆఫ్ ద సిటీ అవార్డు ప్రదానం చేశారని చెప్పింది. కూచిపూడి నృత్యాన్ని ఎల్లలు దాటించిన ఘనత వెంపటి చిన్న సత్యందని ప్రశంసించింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications