వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 మరణాలు: చిక్కుల్లో ఎన్నారై డ్రింక్

By Pratap
|
Google Oneindia TeluguNews

USA Flag
వాషింగ్టన్: అత్యంత సంపన్న ఎన్నారైల్లో ఒకరైన ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్త చిక్కుల్లో పడ్డారు. ఆ ప్యాపారి అందించే అధిక కెఫీన్ శక్తీ పానీయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. దాన్ని సేవించడం వల్ల గత నాలుగేళ్లలో 13 మరణాలు సంభవించడంతో లక్నోకు చెందిన ఇండియన్ అమెరికన్ వ్యాపారి మనోజ్ భార్గవ ఇబ్బందుల పాలవుతున్నారు.

అతని 5 - అవర్ ఎనర్జీ డ్రింక్ ఓ అమెరికాలో ఓ ఆచారంగా మారింది. ట్రక్కర్లు, ట్రేడర్లు, పార్టీ హోపర్లు, విద్యార్థులు - ఇతర లేట్ నైట్ వర్గాల్లో విరివిగా అది ప్రచారంలోకి వచ్చింది. అది సేవించిన వారు స్బృహ కోల్పోవడం, గుండె నొప్పులకు గురి కావడం వంటి వాటికి గురవుతున్నట్లు అనుమానం రావడంతో ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ దానిపై దృష్టి పెట్టింది. ఆ డ్రింక్‌పై స్క్రూటినీ ప్రారంభమైంది.

2009 నుంచి 5 - అవర్ ఎనర్జీ డ్రింక్‌పై ఎఫ్‌డిఎ 90 ఫైలింగ్స్, మీడియా రిపోర్ట్స్‌ను బట్టి పరిశీలన జరుగుతోంది. అయితే, అవన్నీ డ్రింక్స్ సేవించడం వల్లనే సంభవించాయని అవి నిర్థారించడం లేదు. అయితే, డ్రింక్స్ మంచిచెడులను పరిశీలించిన అవసరాన్ని మాత్రం అవి తెలియజేస్తున్నాయని అంటున్నారు. 2004లో భార్గవ ఈ 5 - అవర్ ఎనర్జీ డ్రింక్‌ను ప్రారంభించిన తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. పరిశ్రమ పెద్దలు అతన్ని అనుసరించడానికి ప్రయత్నించారు. ఈ ఏడాది భార్గవ అమెరికాలోని సంపన్న భారతీయుడిగా ముందుకు వస్తారని ఫోర్బ్స్ మాగజైన్ రాసింది.

తన తల్లిదండ్రులతో పాటు భార్గవ తన యుక్తవయస్సులో అమెరికా వచ్చారు. ఆధ్యాత్మిక విద్యలో పరిశోధన కోసం ఆయన భారతదేశంలో విస్తృతంగా పర్యటించారు కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా, గుమాస్తాగా, టాక్సీ డ్రైవర్‌గా, ప్రింటింగ్ ప్రెస్ ఆపరేటర్‌గా పనిచేసాడు. ఆ తర్వాత ప్లాస్టిక్, ముడి పదార్థాల సంస్థను ప్రారంభించారు. దాని అమ్మకాలు 20 మిలియన్ డాలర్లకు పెరిగాయి. దాన్ని ఓ ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు విక్రయించాడు.

భార్గవ 2004లో లివింగ్ ఎసెన్షియల్ అనే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థను ఏర్పాటు చేసి, 5 - అవర్ ఎనర్జీ డ్రింక్‌ను ప్రవేశపెట్టాడు. కొద్ది కాలంలోనే అది ప్రజాదరణ పొందింది. ఏడేళ్ల కాలంలో బిలియన్ల కొద్ది డాలర్లకు దాని అమ్మకాలు పెరిగాయి. అటువండి డ్రింక్‌తో ఇతర బడా పారిశ్రామికవేత్తలు ఆ డ్రింక్‌తో పోటీ పడడానికి ప్రయత్నించారు. అటువంటి డ్రింక్స్ పోటీ రావడంతో పరిశ్రమపైనే స్క్రూటినీ మొదలైంది. వ్యక్తిగత స్థాయిలో భార్గవ సేవాతత్పరుడిగా పేరు పొందారు.

English summary

 A high-caffeine energy drink which has propelled an Indian-American businessman to the billionaire's club — and arguably to the top of the wealthiest NRIs in America list — is under scrutiny after being cited in 13 deaths over the last four years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X