ఎన్నారైల గణతంత్ర దినోత్సవం

సందర్భం ప్రాశ్యస్త్యాన్ని టిసిఎ అధ్యక్షుడు సైదేష్ అజ్జన్ వివరించారు. టిసిఎ తెలంగాణ సంస్కృతిని తమ తర్వాతి తరాలకు ఎలా అందిస్తుందనే విషయాన్ని ఆయన వివరించారు. సింధుజ కూచిపూడి నృత్యం, సుమస్వర, సునేరి, ప్రేరణల దేశభక్తి గీతాలపనతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పిల్లలు, పెద్దలు బలు దేశభక్తి గీతాలు ఆలపించారు. స్వాతంత్ర్య సమరయోధుల డ్రెస్సులో పిల్లలు వేదికపై నడిచారు. టిసిఎ సాంస్కృతిక కార్యదర్శి చంద్రకళ సిరందాస్ కార్యక్రమం విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారు. టిసిఎ కోశాధికారి బాలేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. టిసిఎ బోర్డు, అడ్వైజరీ ప్యానెల్ సభ్యులు ఉమా చింతలపాటి, భాస్కర్ బండికల్లు, అర్షద్ హుస్సేన్, రమేష్ గుబ్బా, రాజు యాసాల, ప్రసాద్ గట్టు, మహిపాల్ అన్నం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications