వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజెర్సీలో శ్రీనివాస కళ్యాణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Venkateswara Swamy
న్యూజెర్సీలోని శ్రీగురువయూరప్పన్ దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మే 5వ తేదీన శ్రీనివాస కళ్యాణం నిర్వహించాలని నిర్ణయించింది. శ్రీగురువయూపరప్పన్ ఆలయం చైర్మన్ డాక్టర్ మణి యజ్ఝసుబ్రహ్మణ్యం ఓ ప్రకటనలో ఆ విషయం తెలిపారు. ఆ ఆలయానికి మోర్గాన్‌లిల్లేలో 42 ఎకరాల విస్తీర్ణం ఆవరణ ఉంది.

భక్తిని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి టిటిడి భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ కొన్నేళ్లుగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తోంది. ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తే శాంతి, సంపద సమకూరుతాయనే విశ్వాసం ఉంది. తన ప్రాజెక్టులో భాగంగా టిటిడి మొదట భాజరతదేశంలోని శ్రీ గురువయూరప్పన్ ఆలయంలో 2010లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించింది. తిరుమలకు వెలుపల నిర్వహించిన తొలి శ్రీనివాస కళ్యాణం ఇదే.

ఆ కళ్యాణాన్ని కన్నులారా వీక్షించడానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఆ కార్యక్రమం విజయవమైన తర్వాత టిటిడి ఆలయానికి శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి ఉత్సవ మూర్తులను బహూకరించింది.

శ్రీనివాసుడి కళ్యాణ నిర్వహణకు మే 5వ తేదీన న్యూజెర్సీ ఆలయానికి వేద పండితులు, అర్చకులు విచ్చేస్తున్నారు. అది శనివారం కూడా అవుతోంది. ఈ కళ్యాణోత్సవానికి టిటిడి చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇతర అధికారులు వస్తారని ఆశిస్తున్నట్లు డాక్టర్ మణి చెప్పారు.

కేవలం శ్రీవారి కళ్యాణం మాత్రమే కాకుండా తిరుమలలో చేసే శ్రీవారి సేవలు కూడా చేస్తారు. ఆ కార్యక్రమం మే 5వ తేదీ ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తోమల సేవ, అర్చన, కళ్యాణం జరుగుతాయి.

English summary
Sri Guruvaayoorappan Temple (Sri Krishnaji Mandir) is pleased that Tirumala Tirupati Devasthanams (TTD) is organizing Sri Srinivasa Kalyanam in New Jersey on Saturday May 5th 2012, at its sprawling 42 acre campus in Morganville, NJ, said Dr. Mani Yegnasubramanian, Chairman of the Temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X