వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో మరో తెలుగు టెక్కీ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Phani Kumar
వాషింగ్టన్: అమెరికాలో మరో టెక్కీ అకాల మృత్యువాత పడ్డాడు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన గొల్లపూడి ఫణికుమార్ మినియాపోలిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఆదివారం తన అపార్టుమెంటు కాంప్లెక్స్‌లోని ఈతకొలనులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. దీన్ని గమనించిన మిత్రులు అతన్ని ఆస్పత్రికి చేర్చారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫణికుమార్ గురువారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో మరణించాడు. యూనివర్శిటీ ఆఫ్ న్యూ హాంఫ్‌షైర్ నుంచి అతను ఎంఎస్ పట్టా పొందాడు.

ఇదిలా వుంటే, ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికా నుంచి వచ్చి హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలోని సాన్ డీగో నుంచి అతను ఆదివారం హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన 30 ఏళ్ల టెక్కీ క్యాబ్‌ను అద్దెకు తీసుకుని అందులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్‌పల్లిలోని బావమరిది ఇంటికి చేరుకున్న తర్వాత అతను కారులోనే మరణించి ఉండటాన్ని డ్రైవర్ గమనించాడు.

వివాహ సంబంధమైన సమస్యలే అతని ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. మృతుడిని ఇమ్మడి అనిల్ కుమార్‌గా గుర్తించారు. ఏడాది క్రితం అనిల్ నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన స్వప్నను వివాహం చేసుకున్నాడు. వివాహమైన తర్వాత దంపతులు ఇద్దరు కూడా అమెరికాకు వెళ్లారు. స్పప్న పది రోజుల క్రితం ఇక్కడికి వచ్చి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయిందని పోలీసులు చెబుతున్నారు.

శనివారం అనిల్ సాన్ డీగో నుంచి శనివారం హైదరాబాద్ వచ్చి కూకట్‌పల్లిలోని సితారా హోటల్లో దిగాడు. ఆదివారం సాయంత్రం మెరూ క్యాబ్‌ను బుక్ చేసుకుని కూకట్‌పల్లిలోని ఈనాడు కాలనీలో గల తన బావ మరిది సురేష్ ఇంటికి బయలుదేరాడు. సాయంత్రం నాలుగున్నరకు ఇంటికి చేరుకున్నాడు. అయితే క్యాబ్ నుంచి దిగలేదు.

అతను ఎవరికోసమైన వేచి చూస్తున్నాడేమోనని భావించి తాను కదిలించలేదని, కొద్దిసేపటికి అతను స్పృహ లేదని గుర్తించి కుటుంబ సభ్యులను పిలిచానని క్యాబ్ డ్రైవర్ జితేందర్ చెప్పాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చేశారు.

English summary
Techie from Ongole of Prakasam district in Andhra Pradesh has died drowning in swimming pool in USA. Phani kumar is working in a software company in USA
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X