లండన్‌లో సిగరెట్ల స్మగ్లింగ్

ఎయిర్ ఇండియా 5 వేల రూపాయలు చెల్లించి అతన్ని విడిపించింది. భావిక్ షాను ఎయిర్ సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే అతన్ని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
హీత్రో విమానాశ్రయంలో ముంబై - లండన్ విమానం దిగిన వెంటనే గత శుక్రవారం ఆ సంఘటన చోటు చేసుకుంది. విమానం సిబ్బంది హోటల్‌కు వెళ్తుండగా పోలీసులు బ్యాగేజీలను సోదా చేశారు. ఓ సంచీలో 50 సిగరెట్ క్రేట్స్ సోదాల్లో బయటపడ్డాయి. దాంతో మొత్తం సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
నాలుగు గంటల పాటు విచారించిన తర్వాత సిగరెట్లు ఉన్న సంచీ షాదని తేలింది. దాంతో మరింత విచారణ కోసం షాను పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. బాండ్ సొమ్మును ఎయిర్ ఇండియా చెల్లించడంతో అతన్ని బెయిల్‌పై విడుదల చేశారు.












Click it and Unblock the Notifications