వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాయ్ ఫ్రెండ్ హత్య: బెయిల్ నిరాకరణ

|
Google Oneindia TeluguNews

Australian Woman
మెల్బోర్న్: ప్రవాస భారతీయుడైన తన బాయ్ ఫ్రెండ్ హత్య కేసులో నిందితురాలికి ఆస్ట్రేలియా సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది. దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్నందున బెయిల్ నిరాకరిస్తున్నట్లు గురువారం కోర్టు స్పష్టం చేసింది. 10రౌండ్ల కాల్పులు జరిపి తన బాయ్ ఫ్రెండ్ హత్యకు పాల్పడింది నిందితురాలు.

ఆస్ట్రేలియాలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్యామ్ ధోడిపై మిలిసా లీ షా జులై 5న హత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 22కేలిబర్ ఆయుధంతో 10రౌండ్ల కాల్పులు జరిపి శ్యామ్ హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది. తనకు మరో వ్యక్తి ఆడం జేమ్స్ గూలెతో పరిచయమవడంతో శ్యామ్ దోడిని వదిలించుకునేందుకు మిలిసా యత్నించినట్లు సమాచారం.

శ్యామ్ ధోడిని హత్య చేయాలని జేమ్స్ ను మిలిసా కోరినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఉద్యోగం నుంచి తొలగిస్తానని, చంపుతానని శ్యామ్ ధోడిని జేమ్స్ బెదరించాడు. కాగా జేమ్స్ ఇచ్చిన ఆయుధంతోనే మిలిసా..శ్యామ్ హత్యకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి.

మరో వైపు శ్యామ్ హత్యకు గురైన సమయంలో మిలిసా ఆమె నివాసంలోనే ఉన్నట్లు నిందితురాలి తరపు న్యాయవాది చెబుతున్నారు. మిలిసా.. హత్యకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తెలిపారు. శ్యామ్ హత్యకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని మరో న్యాయవాది తెలిపారు. కాగా తనను కుట్ర పూరితంగా హత్య కేసులో కొందరు ఇరికించారని మిలిసా చెబుతున్నారు.

English summary
An Australian woman charged for killing her 37-year-old Indian boyfriend by pumping 10 bullets in his head was today denied bail by the Supreme Court saying that she could flee the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X