వేరే మహిళతో భర్త రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య !!

ఖమ్మం నగరంలో వివాహేతర సంబంధం వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మరో మహిళతో లాడ్జ్‌లో ఉన్న భర్తను భార్య స్వయంగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ సంఘటన బల్లేపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ లాడ్జ్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రేమ వివాహం.. తర్వాత విభేదాలు

ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కొర్లపాటి వంశీ, నాయుడుపేట గ్రామానికి చెందిన స్వాద్విని కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రారంభంలో వారి దాంపత్య జీవితం సాఫీగా సాగినప్పటికీ, పెళ్లి తర్వాత వంశీ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని భార్యకు అనుమానాలు మొదలయ్యాయి.

wife-caught-husband-with-another-women-that-extra-marital-affair-at-khammam-district-and-video-got-v

కుటుంబ సభ్యులు, బంధువులు పలుమార్లు వంశీని మందలించినప్పటికీ, అతడు తన ప్రవర్తన మార్చుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం కారణంగా తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వంశీ ఖమ్మంలోని ఓ లాడ్జ్‌లో మరో మహిళతో ఉన్నాడనే సమాచారం స్వాద్వినికి అందింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చి, తన బంధువులతో కలిసి లాడ్జ్‌కు వెళ్లింది. అక్కడ గదిలో భర్తను మరో మహిళతో చూసిన భార్య తీవ్ర ఆగ్రహానికి గురైంది.

ఆ సమయంలో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తను భార్య నిలదీయగా, లాడ్జ్ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి సిబ్బంది, స్థానికులు ఈ ఘటనను ఆసక్తిగా గమనించారు. అనంతరం వంశీని, సంబంధిత మహిళను అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భర్త ప్రవర్తన వల్ల కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, మానసికంగా వేధింపులకు గురవుతున్నామని భార్య, ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. లాడ్జ్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు, దంపతుల మధ్య ఉన్న విభేదాలపై ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన ఖమ్మం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల మధ్య ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం బాధాకరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ వ్యవహారాల్లో పరస్పర నమ్మకం, అవగాహన ఎంతో ముఖ్యమని పెద్దలు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+