ముగ్గురు స్టార్ హీరోలు.. మూడు ఇండస్ట్రీ హిట్లు.. ఈమెనే లక్కీ చార్మ్!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రస్తుతం తన కెరీర్లో స్వర్ణయుగాన్ని ఆస్వాదిస్తోంది. ఈ నెలలోనే త్రిష తన 43వ పుట్టినరోజును జరుపుకోగా.. తాజాగా బాక్సాఫీస్ వద్ద ఆమె ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. తమిళ చిత్రసీమలోని ముగ్గురు అగ్రహీరోల కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో త్రిషనే హీరోయిన్ కావడం విశేషం. దలపతి విజయ్, అజిత్ కుమార్, సూర్యల కెరీర్ బెస్ట్ హిట్స్‌లో త్రిషన్ కామన్ ఫ్యాక్టర్ అంటూ ఓ అభిమాని చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై త్రిష స్పందించింది. ఆ పోస్ట్ ను త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో లవ్ ఎమోజీతో షేర్ చేయడంతో ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

ముగ్గురు హీరోలు.. మూడు ఇండస్ట్రీ హిట్లు!
బాక్సాఫీస్ గణాంకాలను పరిశీలిస్తే త్రిష సాధించిన ఈ రికార్డు నిజమేనని స్పష్టమవుతోంది. 2023లో విజయ్ సరసన త్రిష నటించిన 'లియో'సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.605 కోట్లకు పైగా వసూలు చేసి విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అజిత్ కుమార్‌తో ఆమె నటించిన 'గుడ్ బాడ్ అగ్లీ' సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.248 కోట్ల మార్కును దాటి అజిత్ కెరీర్‌లో టాప్ గ్రాసర్‌గా నిలిచింది. తాజాగా సూర్య హీరోగా నటించిన 'కరుప్పు'సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరడమే కాకుండా, సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మూడు హిట్‌ సినిమాల వెనుక ఉన్న ఏకైక కామన్ ఫ్యాక్టర్ త్రిష కావడం విశేషం.

Trisha Krishnan Reacts to Being the Lucky Charm Behind Vijay Ajith and Suriya Biggest Hits

విజయ్ రాజకీయ విజయంపై త్రిషక్రేజీ పోస్ట్
కొద్ది రోజుల క్రితం త్రిష 'కరుప్పు' సినిమా షూటింగ్ సెట్స్ కు సంబంధించిన కొన్న తెరవెనుక ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఈ పోస్ట్‌కు ఆమె పెట్టిన క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. "నా మ్యాజికల్ మే నెల.. గెలుపు కోసం మరొకటి అందించింది. ఇదంతా దేవుడి దయ" అని త్రిష రాసుకొచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ సాధించిన అద్భుత విజయాన్ని ఉద్దేశించే త్రిష ఈ 'విక్టరీ' క్యాప్షన్ పెట్టిందంటూ నెటిజన్లు అప్పుడే లింక్ చేయడం మొదలుపెట్టారు.

విజయ్-త్రిష డేటింగ్ రూమర్స్
కోలీవుడ్‌లో విజయ్, త్రిషలది మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఆన్‌స్క్రీన్ జంట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో'సినిమా కోసం వీరు మళ్లీ జతకట్టారు. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విజయ్, త్రిషల రిలేషన్ షిప్‌పై రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారాలపై అటు విజయ్ కానీ, ఇటు త్రిష కానీ ఎప్పుడూ స్పందించలేదు. ఇదిలా ఉంటే.. విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం డిసెంబర్ 2025లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+