వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయులకు తగ్గిన బ్రిటిష్ వీసాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

British Flag
లండన్: యుకె పర్యటన కోసం భారతీయులకు ఇచ్చే బ్రిటిష్ వీసాలు పెద్ద యెత్తున తగ్గాయి. పని కోసం లేదా చదువు కోసం ఇచ్చే ఏడాదిలో వీసాలు 19 శాతం వరకు తగ్గినట్లు జాతీయ గణాంకాల ప్రభుత్వ కార్యాలయం (ఓఎన్ఎస్) ఇమిగ్రేషన్ డేటా తెలియజేస్తోంది. యుకె భారతీయులను మనస్ఫూర్తిగా ఆహ్వనిస్తామని ఇటీవలి భారత పర్యటనలో ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పారు.

అయితే 2011 - 2012 మధ్య కాలంలో భారతీయులకు జారీ చేసిన విసాలు 18,365 తగ్గినట్లు ఎఎన్ఎస్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇది 19 శాతం తక్కువ. ఇందులో విజిటర్, ట్రాన్సిట్ వీసాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పాకిస్తానీలకు ఇచ్చిన వీసాలు 48 శాతం తగ్గాయి.

ఆసియా దేశాలకు బ్రిటిష్ వీసాలు పెద్ద యెత్తున తగ్గాయి. 2011 డిసెంబర్ చివరి నుంచి 2012 డిసెంబర్ చివరి వరకు యుకె వీసాలు పొందే విషయంలో ఎక్కువగా ప్రభావం పడింది పాకిస్తాన్‌పైనే. భారతీయులకు 19 శాతం, శ్రీలంక దేశస్తులకు 45 శాతం, బంగ్లాదేశీలకు 30 శాతం బ్రిటిష్ వీసాలు తగ్గాయి. చైనీయుల వీసాలు మాత్రం పది శాతం పెరిగాయి.

యుకెలో విద్యాభ్యాసం కొత్త వీసా నిబంధనల వల్ల కనాకష్టంగా మారిందని భారత విద్యార్థులు భావిస్తున్నారనే విషయం నిరూపితమైంది. 2012 డిసెంబర్‌తో ముగిసిన ఏడాదిలో 209,804 మంది భారతీయ విద్యార్థులు చదువు కోసం యుకె వీసాలు పొందారు. అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే 20 శాతం అది పడిపోయింది.

English summary

 The number of Indians receiving visas to travel to the UK, either to work or study, fell by nearly 20% over a year, according to the latest immigration data from the government's office of national statistics (ONS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X