• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా జంపాల

By Pratap
|
Chowdary Jampala
టెక్సాస్: అమెరికాలోని తెలుగు సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2013 -15 కార్యవర్గం ఏకగ్రీవంగా సోమవారం ఎన్నికైంది. కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జంపాల చౌదరి, కార్యదర్శిగా వేమన సతీష్, కోశాధికారిగా తాతా మధు, సహాయ కార్యదర్శిగా కొల్లా సుబ్బారావు, బోర్డ్ ఆఫ్ డైరక్టర్లుగా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, వలివేటి బ్రహ్మాజీ, 'తానా ఫౌండేషన్' ట్రస్టీలుగా తాళ్లూరి జయశేఖర్, కోయ హరీష్, ప్రాంతీయ సమన్వయకర్తలుగా గుడిసేవ విజయ్ (క్యాపిటల్), పొట్లూరి రవి (మిడ్అట్లాంటిక్, యలమంచిలి రావు (న్యూ ఇంగ్లాండ్), పెద్దిబోయిన జోగేశ్వరరావు (నార్త్), మహిధర్ రెడ్డి (నార్త్‌వెస్ట్), బల్ల భక్త(వెస్ట్), లింగమనేని అనిల్ (కెనడా)లు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు తానాఅధ్యక్షుడు తోటకూర ప్రసాద్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ గుండవరం పాపారావులు సంయుక్త ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుత తానా అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర నుంచి ప్రస్తుత కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడి గా ఉన్న మోహన్ నన్నపనేని 2013 జూన్ నుండి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి 2015 జూలై వరకు తానా అధ్యక్షుడి గా కొనసాగుతారు. ఆ తర్వాత ఇప్పుడు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ జంపాల చౌదరి 2015 జూలై లో తానా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. 32 సంవత్సరాల తరువాత మొదటిసారిగా తానా అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగా జరగటం ఈ ఎన్నికల ప్రత్యేకత. ఇంతటి అరుదైన గౌరవం, అవకాశం తనకు కలిగించినందుకు తానా సభ్యులకు డాక్టర్ జంపాల చౌదరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తానాకోసం, తానా సభ్యుల సంక్షేమం కోసం, తెలుగు వారందరికోసం, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, పరివ్యాప్తికోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని డాక్టర్ జంపాల చౌదరి మాట ఇచ్చారు. తెలుగు సాహిత్యాభిమానిగా, పత్రికా సంపాదకునిగా తెలుగువారందరికీ సుపరిచితులైన డాక్టర్ జంపాల చౌదరి వృత్తిరీత్యా మానసిక వైద్యులు. చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

రెండు దశాబ్దాలుగా తానాకు పలువిధాలుగా సేవ చేసిన డాక్టర్ జంపాల చౌదరి, ఎన్నికల ప్రక్రియలు ప్రారంభం అయ్యేంతవరకు తానా పాలకమండలికి ఛైర్మన్‌గా పనిచేశారు. తానా ప్రచురణలు, అంతర్జాలంలో తెలుగు నిఘంటువులు, టీంస్క్వేర్ భద్రతా సూత్రాలు వంటి అనేక తానా కార్యక్రమాలలో డాక్టర్ జంపాల చౌదరి ముఖ్యపాత్ర వహించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 The Nominations and Elections Committee of Telugu Association of North America (TANA) announced. V Chowdary Jampala has been unanimously elected as the Executive Vice President of TANA for the 2013 - 2015 term (and the President of TANA for 2015 - 2017).

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more