వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇండిపెండెంట్' ఎడిటర్ ఇండియన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Indian named editor of The Independent
లండన్: బ్రిటన్‌కు చెందిన జాతీయ పత్రిక ది ఇండిపెండెంట్‌కు ఎడిటర్‌గా ఒక భారత సంతతి జర్నలిస్టు నియమితులయ్యారు. శ్వేతజాతీయేతరుడు ఈ పత్రిక సంపాదుకుడు కావడం ఇదే మొదటిసారి. 29 ఏళ్ల అమోల్ రాజన్ ఎడిటర్‌గా నియమితులయ్యారు.

ఇప్పటి వరకు కామెంట్ ఎడిటర్‌గా ఉన్న రాజన్ ఇక నుంచి 'ది ఇండిపెండెంట్‌'కు ఎడిటోరియల్ హెడ్‌గా వ్యవహరిస్తారని ఆ పత్రిక యాజమాన్యం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జన్మించిన రాజన్, దక్షిణ లండన్‌లోని టూటింగ్‌లో పెరిగి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించారు.

అనంతరం ఈవినింగ్ స్టాండర్డ్, చానల్-5లలో కొంతకాలం పనిచేసి, రిపోర్టర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఇపుడు ప్రతిష్టాత్మక జాతీయ పత్రికకు ఎడిటర్‌గా నియమితులయ్యే అవకాశం లభించింది. ఇంతవరకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉన్న లీసా మార్క్‌వెల్ కూడా ఎడిటర్‌గా నియమితులయ్యారు.

English summary
A 29-year-old Indian-origin journalist was today named the editor of The Independent, becoming the first non-white editorial head of a UK national paper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X