అమెరికాలో కడియం తెలంగాణ మాట

బోస్టన్: తెలంగాణ ఎన్నారై అసోసిషయేషన్ (తెనా) బోస్టన్ చాప్టర్ మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పోలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరితో మసచుసెట్స్ లెక్సింగ్టన్‌లో ఈ నెల 20వ తేదీన సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన విస్తృతంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసుకోవడానికి 2004 ఎన్నికలకు ముందు మంచి అవకాశాలున్నాయని ఆయన అన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీతో 25 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవాలనేది కఠినమైన నిర్ణయమేనని, తన తెలంగాణ మాతృభూమి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పనిచేశానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నందున తాను తెరాసలో చేరానని చెప్పారు.

Kadiyam Srihari

చర్చాగోష్టిలో భాగంగా ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. పునాది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, అన్ని సీట్లలో పోటీ చేసి గెలిచే లక్ష్యంతో తెరాస పనిచేస్తోందని చెప్పారు. తమ పోరాటానికి ఎన్నారైల ప్రోత్సాహం ఎంతో తోడ్పడుతుందని ఆయన చెప్పారు.

తెనా ఉపాధ్యక్షుడు అమర్ కర్మిల్ల స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. తెనా అధ్యక్షుడు వెంకట్ మారోజు కడియం శ్రీహరిని పరిచయం చేశారు. తెనా బోస్టన్ కోర్ టీమ్ సభ్యులు పాపారావు గుండవరం, రాజేందర్ కలవల, వెంకటరెడ్డి ముద్దసాని, శ్రీనివాస్ మేనేని, అర్వింద్ తక్కెళ్లపల్లి తదితరులు మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+