వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్య కేసు: 25మంది ఇండియన్స్ అరెస్ట్, మోడీకి మొర

|
Google Oneindia TeluguNews

కువైట్/న్యూఢిల్లీ: ఇద్దరు ఈజిప్షియన్ల హత్య కేసులో కువైట్ ప్రభుత్వం 25మంది భారతీయులను అరెస్ట్ చేసింది. వారిని రక్షించాల్సిందిగా వందలాది సహోద్యోగులు భారత ప్రధాని నరేంద్ర మోడీకి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు సంక్షిప్త సందేశాలు, అక్కడి పరిస్థితలను తెలిపే వీడియో సందేశాలను పంపారు.

తాము పని చేస్తున్న సంస్థలోనే తమను నిర్బంధించి వేధిస్తున్నారని వారు పేర్కొన్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా ఇద్దరు ఈజిప్షియన్లు మృతి చెందారు.

25 Indian Workers in Kuwait Arrested For Murder, Their Colleagues Send SOS

దానికి బాధ్యులుగా 25మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో 500 మంది కార్మికులను సంస్థలోనే నిర్బంధించారు. వీరిలో చాలా మంది పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారని తెలిసింది.
యాజమాన్యం తమను వేధిస్తోందని.. భారత ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఎస్ఎంఎస్‌లు పంపి వేడుకున్నారు.
కువైట్‌లో భారతీయుల పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

English summary
India has taken up with Kuwait the case of 25 workers who have been arrested after a brawl in which two Egyptians were reportedly killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X