NRI News: చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో 5కె రన్..
మే 12న మాతృదినోత్సం రోజు పురస్కరించుకుని చికాగో ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో 5కె, వాక్ నిర్వహించారు. చికాకూ ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో మదర్స్ డే రోజు వాక్ నిర్వహిస్తారు. ఈసారి కూడా 5కె వాక్ ఘనంగా నిర్వహించారు. వాక్ లో దాదాపు 200 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని చికాగో ఆంధ్ర సంఘం అధ్యక్షురాలు శ్వేత, ఛైర్మన్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన వారికి చికాగో ఆంధ్ర సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఉదయం 8 గంటలకు డ్యాన్స్ ఫిట్ నెస్ ప్రొగ్రామ్ నిర్వహించారు. అనంతరం వాక్ చేపట్టారు. వాక్ ను మూడు విభాగాల్లో నిర్వహించారు. 12 సంవత్సరాల లోపు ఉన్నవారు, 21 సంవత్సరాల లోపు ఉన్నవారు, 21 సంవత్సరాలు పైబడిన వారు వాక్ లో పాల్గొన్నారు. 5కె రన్ లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు.

విజేతలకు సిలికాన్ ఇడ్లీ లైనర్, క్లాష్ కస్టమర్ వారు బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి విష్ణు విల్లాస్ వారు ఉచితంగా అల్పహారం అందించారు. మిలెట్ ఇండ్లీ, పొంగలి, మైసూర్ బజ్జీ, 4 రకాల పచ్చళ్లు వడ్డించారు. ఈ కార్యక్రమంలో సీఏఏ ఫౌండేషన్ (CAF) తరఫున సవితా మునగ, అనురాధ గంపాల మొక్కలను (Plants) విరాళాల కొరకు అమ్మకానికి పెట్టారు. విరాళాల సేకరణ ద్వారా సమకూర్చిన ధనము పేదవారికి అందజేయనున్నారు.
ఈ వేడుకల్లో తమిశ్ర కొంచాడ ఏర్పాటు చేసిన అందమైన ఫోటో బూత్ వద్ద (Photo Booth) తల్లులు తమ పిల్లలతో చక్కని ఫోటోలు తీయించుకున్నారు.












Click it and Unblock the Notifications