NRI News: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన భారతీయుడికి 16 ఏళ్ల జైలు శిక్ష..
విద్యార్థినిపై అత్యాచారం చేసిన భారతీయుడికి సింగపూర్ కోర్టు 16 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ అత్యాచార ఘటన నాలుగేళ్ల క్రితం జరగ్గా..తాజాగా తీర్పు వచ్చింది. 2019లో సింగపూర్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థిని రాత్రి పూట ఇంటికి వెళ్లేందుకు బస్ట్ స్టాక్ వద్దకు వెళ్తోంది. ఆమెను గమనించిన చిన్నయ్య అనే క్లీనర్ విద్యార్థినిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె దారి మళ్లింది. చిన్నయ్య ఆమె వెంట పడ్డాడు. తర్వాత ఆమె రైల్వే స్టేషన్ వైపు వెళ్లాలని ప్రయత్నం చేసింది.
కానీ చిన్నయ్య ఆమెపై దాడికి దిగాడు. కొట్టిడాడు. ఆమెను దగ్గరలోని అటవీలోకి తీసుకెళ్లాడు. ఆమెపై దాడి చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలిని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ లోగా పక్కనే ఉన్న ఫోన్ తీసి తన స్నేహితుడికి ఫోన్ చేసింది. తాను అత్యాచారానికి గురయ్యాయని.. ఫలనా ప్రాంతంలో ఉన్నట్లు చెప్పింది. ఆమె తన పరిసరాలను పట్టించుకోకుండా 10 నుంచి 15 నిమిషాలు అచేతనంగా నడిచింది. ఈ లోపు స్నేహితుడు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించాడు.

పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. అప్పటి నుంచి కోర్టులు ఈ కేసు విచారణ కొనసాగుతోంది. క్యాంపస్‌కు తిరిగి వస్తున్న సమయంలో తప్పుగా ఎంఆర్‌టీ రైలు ఎక్కిన బాధితురాలు అర్థరాత్రి క్రాంజీలో చేరిందని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కయల్ పిళ్లే కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత నిందితుడు బాధితురాలని తప్పుదోవ పట్టించాడని పేర్కొన్నాడు.
స్నేహితుడు వెళ్లే వరకు బాధితురాలు ప్రధాన రహదారిపైకి వెళ్లి తెల్లవారుజామున 2.05 గంటల వరకు ఏడుస్తూ అక్కడే కూర్చున్నారని వివరించారు. నాలుగేళ్లు గడిచినా బాధితురాలు ఇప్పటికీ ఈ ఘటన వల్ల మానసికంగా, మానసికంగా బాధ పడుతుందని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. నిందితుడి దోషిగా నిర్ధారించి కఠిన శిక్ష విధించాలని కోర్టును కోరారు. విచారణ చేపట్టిన సింగపూర్ కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. భారత్‌కు చెందిన చిన్నయ్యకు 16 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12 బెత్తం దెబ్బలు తినాలని ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications