తెలంగాణ సంఘాల ఐక్య వేదిక ఏర్పాటు

Subscribe to Oneindia Telugu

లండన్: యూకె, యూరప్ దేశాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన, సంస్కృతి ప్రచారం,సేవ లక్ష్యంగా
తెలంగాణ సంఘాలు ఒక ఐక్యవేదిక ఏర్పాటయ్యే తరుణం ఆసన్నమైంది.

building a platform for all telangana organisations

తెలంగాణ అభివృద్ధి, సంస్కృతి,సాంప్రదాయాల పరిరక్షణ,చరిత్ర పరిశోధన ,సేవ ,విద్యాభివృద్ధి ,ఆధునిక వ్యవసాయ పద్ధతి,గ్రామీణాభివృద్ధి,టూరిజం,అభివృద్ధి లో పాత్ర తదితర అంశాల లక్ష్య సాధనే ద్యేయంగా ఒక చారిత్రాత్మక ఒప్పందానికి నడుంబిగించి ఒక సమాఖ్య ఏర్పాటుకు
లండన్ వేదిక గా పునాదులు పడ్డాయి .

building a platform for all telangana organisations

నిన్న లండన్ వేదిక ద్వారా జరిపిన సంఘాల సమాఖ్యలో తీసుకున్న నిర్ణయాలు
తీర్మానాలకు అందరం కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకొని సామూహిక ప్రెస్ నోట్ విడుదలచేయడమైనది .

building a platform for all telangana organisations

సమాఖ్య తీసుకున్న నిర్ణయాలు మరియు తీర్మానాలు
1) సమాఖ్య ఆశయాలకు కట్టుబడి కలిసి వచ్చే తెలంగాణ సంఘాలను ఆహ్వానిస్తామని సభలో
నిర్ణయించారు
2) ప్రతి సంస్థ ఆలోచనలను పరిగణలోకి తీసుకోవాలి
3) ప్రతి సంస్థ నుండి 3 ముగ్గురు సభ్యుల ప్రాతినిధ్యం
4) సంస్థల మధ్య స్నేహపూర్వక పోటీ
5) సభలు ,సామావేశాల్లో పరస్పర సహకారం
6) వేదిక ద్వారానే Telangana అథిధి మర్యాదలు చేయడం
7) రాజకీయ పార్టీ లకు అతీతంగా పని చేయాలి
8) ప్రతి మూడు నెలలకు ఒక సమీక్ష సమావేశం .

ఈ ​ఐక్యవేదిక లో కలిసి వచ్చే తెలంగాణ సంస్థలు తెలంగాణ సంస్థలు చేరవచ్చును మరియు ఈ
ఐక్యవేదిక స్వయం పాలక మండలి తీరులో పనిచేస్తుంది అన్ని సంస్థ సభ్యులు ఈ సందర్భంగ
చెప్పడం జరిగింది.

ఈ ​ఐక్యవేదిక లో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ యూకే యూరోప్(TDF UK& EUROPE , తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ (UK Jagruthi ),తెలంగాణ nri ఫోరమ్(TeNF
UK),కెసిఆర్ & తెరాస సపోర్టర్స్ యుకే యూరోప్ (KTS UK& EU), మరియు రీడింగ్ జాతర (Reading Jatara),తెలంగాణ యూరోప్ కల్చరల్ అసోసియేషన్ (TECA)కాన్ఫరెన్స్ లో పాల్గొనివారిలో ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
London Telanganites were in a plan to form one platform for all telangana organisations
Please Wait while comments are loading...