అమెరికాలో వివాహిత మృతి, అల్లుడే హంతకుడు అంటోన్న మహిళ పేరంట్స్..
అమెరికాలో ఓ వివాహిత చనిపోయింది. న్యూజెర్సీలో ప్రేమలత (32) మృతిచెందింది. ఈమె స్వస్థలం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం. ప్రేమలతకు 2016లో పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్ నాయుడితో పెళ్లయ్యింది. మరుసటి ఏడాది వీరు అమెరికా వెళ్లారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు గానీ.. ప్రేమలత విగతజీవిగా మారింది.
ప్రేమలత అనుమానాస్పద స్థితిలో కన్నుమూయడంతో సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి బలం చేకూర్చేందుకు ఆమె పేరంట్స్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రేమలతను భర్తే హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారిద్దరి మధ్య గొడవ ఉందో లేదో తెలియదు కానీ.. మృతదేహాన్ని ఇండియా పంపించాలని ప్రేమలత తండ్రి త్యాగరాజులు నాయుడు కోరారు. ఇందుకు అల్లుడు సుధాకర్ నాయుడు నిరాకరించారు. దీంతో వారి అనుమానం మరింత పెరిగింది. ఏదో జరిగిందని.. అందుకే పంపించడం లేదు అని చెబుతున్నారు.

ప్రేమలత ఆత్మహత్య చేసుకుందని తమకు మంగళవారం రాత్రి సమాచారంచ వచ్చిందని త్యాగరాజులు నాయుడు తెలిపారు. దీంతో వారు తీవ్ర ఆవేదన చెందారు. తొలుత అల్లుడిపైనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రేమలత మరణం వెనుక కుట్ర ఉందని, అల్లుడే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ మేరకు చిత్తూరు కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తాకు పిటిషన్ కూడా అందజేశారు. దీనిని కలెక్టర్ రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వాలకు ఫార్వార్డ్ చేయాల్సి ఉంది. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications