తానా సభల్లో తన్నుకున్న "తెలుగు" తమ్ముళ్లు - తారక్ ప్రస్తావనే కారణమా (వీడియో)..!?

అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడి గుద్దులు గుద్దుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరిగింది. జూ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనతో రెండుగా చీలిపోయి కొట్టుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. కోట్లాడ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

అమెరికాలో సుదీర్ఘ చరిత్ర ఉన్న తానా సభలకు ఫిలడెల్ఫియా వేదికగా నిలిచింది. పెన్సిల్వేనియాలో జరుగుతున్న 23వ తానా మహసభలను ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పలువురు ప్రముఖులుఈ వేడుకలను ప్రారంభించారు.

తొలి రోజు బాంకెట్ డిన్నర్ ముగిసిన తర్వాత తానాలోని కొందరు ముఖ్యులు కన్వెన్షన్ సమీపంలోని హాలులో కలుసుకున్నారు. సభలకు అమెరికాలోని తెలుగుదేశం పార్టీ మద్దతు దారులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ఇక్కడే హాజరైన వారు రెండు వర్గాలుగా చీలి కొట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.

 TANA

కొందరు జూ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావటంతో నచ్చని కొందరు టీడీపీ మద్దతుదారులుగా ఉన్న సభ్యులు గొడవకు దిగారని..అది చిలికి చిలికి కొట్టుకొనే వరకూ వెళ్లిందని ప్రచారం సాగుతోంది. వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలతో కోట్లాట వీడియో పోస్టు చేసింది. ఇదే అంశం పైన తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు వివాదానికి దిగాయి.

ముందు మాట, మాట అనుకున్న తమ్ముళ్లు.. తర్వాత తన్నులాటకు దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. రెండుగా చీలిపోయిన తెలుగుదేశం సానుభూతిపరులు పిడి గుద్దులు గుద్దుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరిగింది. వారిని జయరాం విడదీసే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కు తగ్గలేదు.

చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడి గుద్దులు గుద్దుకున్నారు. తెలుగు జాతిని కీర్తిని చాటేలా జరిగే సభల చోట ఇలాంటి కోట్లాట వార్తలు వైరల్ అవుతున్నాయి. జూ ఎన్టీఆర్ పేరు ప్రస్తావన కారణంగానే ఈ కోట్లాట జరిగిందనే వార్తల నడుమ ఈ వివాదం కొత్త టర్న్ తీసుకుంది. దీని పైన సోషల్ మీడియాలో పోస్టింగ్ లు కనిపిస్తున్నాయి. దీని పైన నిర్వాహకులు స్పందన చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+