గ్లోబల్ హిందూ హెరిటేజ్ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్రహ్మణ్యస్వామి

అమెరికా : భారతీయ అస్తిత్వం హిందుత్వంలోనే ఉందని స్పష్టం చేశారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. అమెరికా అస్తిత్వ మూలమైన ఆంగ్లో-సాక్షన్ ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీకి భారతీయ హిందుత్వంతో సారూప్యం ఉందన్నారు. అమెరికాలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నట్టే.. ఇండియాలోను అనేక వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారని, అయితే వారందరి మూలాలన్ని హిందూత్వంలోనే ఉన్నాయన్నారు.

అమెరికాలోని టెక్సాస్ లో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ' అనే కార్యక్రమంలో పాల్గొన్న సుబ్రహ్మణ్యస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు 600 మంది సభకు హాజరవడంతో.. కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్లానో హాల్ కిక్కిరిసిపోయింది. హిందూ ప్రజలను హిందూత్వ అభిమానులను , హిందూ చరిత్ర, హిందూ ఆలయాల విశిష్టత గురించి వివరిస్తూ.. సుబ్రహ్మణ్య స్వామి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సెప్టెంబర్ 13న ఈ కార్యక్రమం జరిగింది.

తన ప్రసంగంలో బాబ్రీ మసీద్ గురించి కూడా ప్రస్తావించిన సుబ్రహ్మణ్య స్వామి.. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించడానికి చట్టబద్దమైన యుద్ద చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉన్నందువల్ల.. ఆలయాలపై నియంత్రణకు దోహదపడుతున్న ఎండోమెంట్ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ నియంత్రణ నుంచి హిందూ దేవాలయాలు విముక్తి కావాల్సిన అవసరముందన్నారు.

క్రియాశీలక స్వచ్చంద కార్యకర్త అయిన గోపాల పొనంగి నేత్రుత్వంలో కార్యక్రమం ఆసాంతం ఆహుతులను ఆకట్టుకుంది. సభకు హాజరైన ప్రతీ ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తొలుత హరి రామసుబ్బు ప్రార్థనలతో మొదలైన కార్యక్రమం.. అనంతరం సుబ్రహ్మణ్య స్వామితో పాటు డల్లాస్ లోని వివిధ సంస్థల అధినేతలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా.. స్వచ్చంద కార్యకర్త గోపాల్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రకాశ్ రావు వెలగపూడిని సభకు పరిచయం చేశారు. అనంతరం మాట్లాడిన ప్రకాశ్ రావు.. సంస్థ చేస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు.

Dr Subramanian Swamy's visit to Dallas for hindu heritage program

తన ప్రసంగంలో సుబ్రహ్మణ్య స్వామి గురించి ప్రస్తావిస్తూ.. పొగడ్తల్లో ముంచెత్తారు ప్రకాశ్ రావు. ఇండియాలో అవినీతిపై పోరాటం చేస్తూ.. మానవీయ విలువలను కాపడడానికి సుబ్రహ్యణ్య స్వామి ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో ఆయన వన్ మ్యాన్ ఆర్మీ అని ప్రశంసించారు. ఆ తర్వాత ప్రసంగించిన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పవిత్ర గురించి ప్రాణ ప్రతిష్ట పూజ గురించి వివరించారు. బ్రిటీష్ కోర్టులు సైతం ప్రాణ ప్రతిష్ట విశిష్టతను అంగీకరించాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో.. ఆనంద్ చెల్లప్ప, అనిల్ ముతోజు, అను అప్పాజీ, డాక్టర్ అరుణ్ , అల్పేశ్ పటేల్, చంద్రకాంతన్, దివ్య సెల్వ, గగన్ శోరి, హరి రామసుబ్బు, ఐవీ రావు, కళ్యాణి తదిమేటి, కామేశ్వరరావు నేమని, లక్ష్మి తుమ్మల, మధుమతి వ్యాస్యరాజు, మహేశ్ చొప్ప, మంజరి గంగావర్, ప్రశాంత్ పటేల్, ఆర్కే పండితి, రాజ్ కుమార్ దండు, రాజ వ్యాస్యరాజు, వెంకట్ కోయంబత్తూర్, సంజయ్ తివారీ, సతీశ్ కంది, శ్రీ గౌర్, శివ అగ్నూర్, శ్రీకాంత్ కొండ, శ్రీనివాస్ గుల్దవల్లేటి, కన్నన్ శ్రీనివాసన్, శ్రీనివాస్ కొడవగంటి, శ్రీనివాస్ పామిడి ముక్కుల, శ్రీనివాస్ కోడెల, వెంకట్ కారుముడి, విజయ్ తోడ్పునూరి, విజయ్ భోగరాజు, విష్ణు చిమ్ముల తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+