అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాదీ మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు మరణించాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన అతను మృత్యువాత పడ్డాడు. కుత్భుల్లాపూర్ సూరారంకు చెందిన నాగ తులసీరామ్(26) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

నాగ తుసీరామ్ బ్రిడ్జిపోర్టు యూనివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు రెండేళ్ల కిందట అమెరికా వెళ్లాడు. వాటర్‌బరిలో ఉంటూ ప్రతిోజు యూనివర్శిటీకి వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తులసీరామ్‌ను ఓ మహిళ కారుతో ఢీకొట్టింది.

Hyderbad youth dies in US in a road acciden

ఆ ప్రమాదంలో తులసీరామ్ అక్కడికక్కడే మకణించాడు. కుమారుడి మృతి తండ్రి శోక సముద్రంలో మునిగిపోయాడు కొడుకు మృతదేహాన్ని ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. పిల్లల చిన్నతనంలోనే నాగ తులసీరామ్ తల్లి మృతిచెందింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad student Naga Tulsiram killed inn a road accident in USA.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X