26వ అంతస్తు నుంచి పడి భారత సంతతి వ్యక్తి మృతి

Indian-origin man dies in Australia after falling from high-rise building
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో విషాదకరమైన సంఘటన జరిగింది. ఆకాశాన్ని తాకే అపార్టమెంటు భవనం 26వ అంతస్తు నుంచి పడి 21 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తి మరణించాడు. రెహ్మత్ సంధు అనే భారత సంతతి వ్యక్తి మెల్బోర్న్‌లోని సిటీ రోడ్ టవర్‌‌ 26వ అంతస్థు నుంచి కిండ పడ్డాడు.

ఆ భవనంలో 36 అంతస్థులున్నాయి. మృతుడు మెల్బోర్న్‌లోని పంజాబ్ డ్యాన్స్ గ్రూపునకు చెందినవాడు. గత రాత్రి సంధుతో, అతని మిత్రులతో డ్రింక్స్‌కోసం కలిసిన నైట్ క్లబ్ యజమాని గ్యారీ వోహ్రా మాటలను ఉటంకిస్తూ ది ఏజే న్యూస్ పేపర్ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.

రెహ్మత్ బాల్కనీ రెయిలింగ్‌పై కూర్చున్నాడని, ఆ సమయంలో కింద పడిపోయాడని తాను విన్నట్లు వోహ్రా చెప్పారు. అయితే, వ్యక్తి మృతిపై దర్యాప్తు చేస్తున్నామని, అపార్టుమెంటులో పలువురిని అడిగి విషయాలు తెలుసుకుంటున్నామని పోలీసులు చెప్పారు.

రెహ్మత్ సంధు మృతిపై అనుమానాలేమీ లేవని, న్యాయమూర్తి కోసం తాము ఓ నివేదికను తయారు చేస్తామని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+