తానా సదస్సులో ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో’(పిక్చర్స్)

హైదరాబాద్: వేలాది మంది ప్రవాస భారతీయులను, ఇండియాలో రియల్ ఎస్టేట్ సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీలనూ ఒకే వేదికపైకి చేర్చేలా అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో'ను జూలై 2 నుంచి డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో జరగనుంది. ఈ కార్యక్రమం తానా సదస్సులో భాగంగా జరగనుంది.

ఈ నేపథ్యంలో గురువారం ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో' బ్రోచర్, వెబ్‌సైట్ ఆవిష్కరణ హైదరాబాద్ నగరంలోని తాజ్ వివంతా హోటల్‌లో జరిగింది. తానా ఇండియా కో ఆర్డినేటర్ గారపాటి ప్రసాద్, డిప్యూటీ కో ఆర్డినేటర్ సుబ్బారావు చేన్నురి, ఐఐఈ వ్యవస్థాపక చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ సుకమంచిలు ఆవిష్కరించారు.

ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో

ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో

వేలాది మంది ప్రవాస భారతీయులను, ఇండియాలో రియల్ ఎస్టేట్ సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీలనూ ఒకే వేదికపైకి చేర్చేలా అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో'ను జూలై 2 నుంచి డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో జరగనుంది. ఈ కార్యక్రమం తానా సదస్సులో భాగంగా జరగనుంది.

ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో

ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో

ఈ నేపథ్యంలో గురువారం ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో' బ్రోచర్, వెబ్‌సైట్ ఆవిష్కరణ హైదరాబాద్ నగరంలోని తాజ్ వివంతా హోటల్‌లో జరిగింది.

ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో

ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో

తానా ఇండియా కో ఆర్డినేటర్ గారపాటి ప్రసాద్, డిప్యూటీ కో ఆర్డినేటర్ సుబ్బారావు చేన్నురి, ఐఐఈ వ్యవస్థాపక చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ సుకమంచిలు ఆవిష్కరించారు.

ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో

ఇంటర్నేషనల్ ఇండియన్ ఎక్స్‌పో

ఈ సందర్భంగా రాజేష్ సుకమంచి మాట్లాడుతూ.. సుమారు 10వేల మంది వరకూ సదస్సుకు హాజరుకానున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాజేష్ సుకమంచి మాట్లాడుతూ.. సుమారు 10వేల మంది వరకూ సదస్సుకు హాజరుకానున్నట్లు తెలిపారు. సదస్సులో స్వల్ప సంఖ్యలో మాత్రమే ఎగ్జిబిటర్లకు అవకాశం ఉంటుందని తెలిపారు. సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. ‘ఈ ప్రదర్శనలో భాగం కావాలని భావించే వారికి కావాల్సిన విమాన టికెట్లు, వీసా సదుపాయాలు, ప్రదర్శనలో సహాయ పడేందుకు బూత్ సిబ్బందిని సమకూర్చనున్నాం. ఫ్రీ షో ప్లానింగ్ నుంచి మార్కెటింగ్, జాతీయం, అంతర్జాతీయ స్థాయి బ్రాండ్స్ ప్రమోషన్ వరకూ ఎలాంటి లోటు రాకుండా పక్కా ప్రణాళికలు రూపొందించాం' అని వివరించారు.

రియల్ ఎస్టేట్ రంగంలో ఎదుగుతున్న కంపెనీలకు ఈ ప్రదర్శన అపూర్వ అవకాశమని తానా ఇండియా కో ఆర్డినేటర్ గారపాటి ప్రసాద్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికపై తమ బ్రాండ్లకు గుర్తింపు పొందే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని దక్షిణాది కంపెనీలకు ఆయన పిలుపునిచ్చారు. మూడు రోజులపాటు సాగే తానా సదస్సులో ఈ ఎక్స్‌పో ప్రధాన ఆకర్షణ కానుందని తానా ఇండియా డిప్యూటీ కో ఆర్డినేటర్ సుబ్బారావు చేన్నురి అభిప్రాయపడ్డారు. ఎన్నారైలకు ఇక్కడి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను పరిచయం చేయడం ద్వారా వారి నుంచి పెట్టుబడులు తెచ్చుకోవచ్చని తెలిపారు. దీంతో రియల్ ఎస్టేట్ కంపెనీల వృద్ధి మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+