కార్మికుడి కుటుంబానికి ‘మైటా’ సాయం(ఫొటో)
నిజామాబాద్/కౌలాలంపూర్: మలేసియాలో మృతి చందిన కార్మికుని కుటుంబానికి మలేసియా తెలంగాణ అసోసియేషన్(మైటా) రూ. 40,వేల ఆర్థిక సహాయం అందజేసింది. నిజామాబాద్ గాయత్రినగర్‌కి చెందిన కలవ బాలకృష్ణ గత 3 సంవత్సరాలుగా మలేసియాలోని జోహారుబారులో వెల్డర్‌గా పనిచేస్తూ మే 28న మలేసియాలో గుండెపోటుతో మృతిచెందాడు.

మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి (జులై 19)ఆదివారం మృతుని కుటుంబసభ్యులను కలిసి పరామర్శించి మృతుడి భార్య అనురాధ, మృతుడి సోదరుడు శ్రవణ్ కుమార్‌లకు రూ. 40వేల నగదును అందజేశారు.
ఈ కార్యక్రమంలో మైటా అడ్వైజర్ ఎబినైజర్, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అంబాసిడర్ వినోద్ కుమార్, ప్రవాసీ మిత్ర ఎడిటర్ భీంరెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications