ఎన్నారై టీఆర్ఎస్ ఆర్థిక చేయూత: సేవ్యరోత్సవం కుటుంబాన్ని ఆదుకోవడానికి..

Subscribe to Oneindia Telugu

బహ్రెయిన్: బహ్రెయిన్ లో మరణించిన, సేవ్యరోత్సవం (బట్టు) కుటుంబానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో రూ.1,83. 861/- రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందచేయడం జరిగింది.

బహరెన్‌లో తెలంగాణ బిడ్డ మృతి: స్వగ్రామానికి మృతదేహాన్ని పంపిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్..

కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలంలోని, రెడ్డిపేట్ తండాకు చెందిన, సేవ్య రోత్సవం (బట్టు), వయసు32, పాస్పోర్ట్ నెంబర్ M3852123,నస్ కంపెనీలో దురదృష్టవశాత్తు గుండె పోటుతో మృతి చెందినడు. వారి పార్థివ దేహాన్ని మృతిచెందిన 13 రోజులలో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తేదీ 24.06.17రోజున స్వగ్రామానికి పంపించడం జరిగింది.

nri trs cell financial help to gulf victim family

వారి అకాల మరణం చాలా బాధాకరం వారికి తల్లి భార్యతో ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు నలుగురూ పిల్లలు ఉన్నారు అతని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయింన ఆ పేద కుటుంబ పరిస్థితులను చూసి నేను సైతం అంటు ముందుకు వచ్చిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి,వారి తోటి కంపనీ లో పనిచేసేకార్మికులు వారి గ్రామానికి చెందిన రవీందర్ నాయక్, బాలు రాతుల,కిసాన్ బట్టు, కొంపెల్లి వెంకటేశ్, lpn ప్రకాష్, గంగవత్ బాలు, చంద్ర లిoగాయా, చెన్య, రమేష్ భూక్య, రవి హర్యా, బాలు బుధ్య, బుక్క రెడ్డి, గంగవత్ జావార్లల్ వారి అద్వర్యంలో ఆర్థిక సాయంగా 1,83. 861/- ఒక్క లక్ష ఎనభై మూడు వేల ఎనమిది వందల అరువది ఒక్క రూపాయల విరాళాలుగా సేకరించి మొత్తాన్ని ఆ బాదిత కుటుంబానికి బ్యాంక్ ద్వారా అందచేసి వారి నలూగురూ పిల్లల బవిశ్యత్ కు ఆపన్న హస్తం అందచేయడం జరిగింది.

nri trs cell financial help to gulf victim family

ఎంతో అభిమానంతో ఆదరించి ఇంత గొప్ప సహాయాన్ని మరణించిన సేవ్య రోత్సవం (బట్టు) కుటుంబానికి అందేలా కృషి చేసిన వారి కృషిని ఐక్యతను సేవహృదయాన్ని ప్రశంసించి అబినందించిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు ప్రశాంత్,రవిపటేల్, సుమన్, జాయంట్ సెక్రెటరీలు రాజేంధార్, సదనంద్, గంగాధర్, సంజీవ్, దేవన్న, విజయ్, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, రాజు, నర్సయ్య, శంకర్, తదితరులు బహ్రెయిన్ లోనే కాదు మొత్తo గల్ఫ్ లో నివసిస్తున్న ఎంతోమంది తెలంగాణ బిడ్డలకు ఆదర్శంగా అవుతుందని దీనికి కృషి చెసిన సభ్యులందరికి పేరు పేరున హ్రుదయపూర్వక కృతజ్ఞతాభివందనములు అభినందనలు తెలియచేసారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NRI TRS Cell members offered financial help to gulf victim's family. They given RS1,83,861 to Sevya Rotsam family
Please Wait while comments are loading...