సాగర్ బై పోల్ ప్రచారంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ నేతలు.. భగత్ జయం కోసం జోరుగా..
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచార పర్వంలో మునిగిపోయారు. ఇటు టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేతలు కూడా రంగంలోకి దిగారు. అభ్యర్థి నోముల భగత్ కోసం ప్రచారం నిర్వహించడానికి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే నాయకలు నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ యూకే కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టముక్కల తెలిపారు.
Recommended Video


కరపత్రం విడుదల..
నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలో సాగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి విషయాలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , అభ్యర్థి నోముల భగత్ మరియు స్థానిక నాయకులు కోటి రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.

పార్టీ కోసం సేవలు
ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే విభాగం పది ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తుందని సతీష్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి, గెలుపు కోసం కష్టపడుతామని చెప్పారు. కేసిఆర్ చేసిన అభివృద్ధిని గడప గడపకు తెలియజేసే ప్రత్యేక కరపత్రాన్ని రూపొందించామని వివరించారు. నోముల నర్సింహులు ఆశయాలని తనయుడు భగత్ ముందుకు తీసుకెళ్తాడానే నమ్మకం ఉందని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. ఉద్యమ సమయం నుంచి లండన్ కేంద్రంగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ పనిచేస్తుందని తెలిపారు.

ధన్యవాదాలు
తన విజయం కోసం ప్రచారం నిర్వహించడానికి వచ్చిన ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే నాయకులకు అభ్యర్థి నోముల భగత్ కృతఙ్ఞతలు తెలిపారు. భగత్ గెలుపు కోసం ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ నేతలు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రాజ్ కుమార్ శానబోయిన, సత్య చిలుముల, మల్లేష్ పప్పుల, శ్రీనివాస్ వల్లాల, పృథ్వి రావుల, ప్రవీణ్ పంతులు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications